హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్య మందుపై చిన్నజీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయన ఎమన్నారంటే..?

Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్య మందుపై చిన్నజీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయన ఎమన్నారంటే..?

ఆనందయ్య మందుపై చిన్నజీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

ఆనందయ్య మందుపై చిన్నజీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణపట్నం ఆనందయ్య మందుపై చిన్నజీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. గత పది రోజులుగా ఎక్కడ చూసిన ఆనందయ్య టాపికే వినిపిస్తోంది. ఆనందయ్య మందుతో ఎలాంటి ప్రమాదం లేదని ఆయూష్ కమిటీ చెప్పడంతో‌.. చాలా మందికి దానిపై నమ్మకం పెరిగింది. ఈ క్రమంలోనే పలువురు ఆనందయ్య మందును వెంటనే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆనందయ్య మందుపై నిపుణుల అధ్యయనాలు జరుగుతున్నాయి. దీంతో ఆనందయ్య మందుకు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఆనందయ్య మందుపై చిన్నజీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఈఎస్‌ఐ ఆస్పత్రిని చిన్నజీయర్ స్వామి సందర్శించారు. అక్కడి డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడిన చిన్నజీయర్ స్వామి.. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.

  ఈ సందర్భంగా మాట్లాడిన చిన్నజీయర్ స్వామి.. కృష్ణపట్నం ఆనందయ్య మందుతో దుష్ప్రభావాలు లేవని ఆయూష్‌ కమిటీ నిర్ధారించిందని అన్నారు. ఉచితం మందును పంపిణీ చేస్తుంటే ఏపీ ప్రభుత్వానికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. కరోనా సంక్షోభం వేళ ఇలాంటి వివాదాలు సరికాదని అన్నారు. ఆనందయ్య మందును పంపిణీ చేసే అవకాశాలను ఏపీ ప్రభుత్వం వెంటనే పరిశీలించాలన్నారు.

  ఇదిలా ఉంటే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత మందు పంపిణీ చేస్తానని ఆనందయ్య ప్రకటించారు. మందు పంపిణీ చేస్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని నమ్మి ఎవరూ కృష్ణపట్నం రావొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమతిచ్చినా.. అవసరమైన మూలికలు లభించిన తర్వాతే మందును ఇస్తామని ఆనందయ్య స్పష్టం చేశారు. ఇప్పటికే ఆనందయ్య మందుపై ఆయూష్ అధికారులు, టీటీడీ ఆయుర్వేద వైద్యులు దీనిని పరిశీలించారు. ఆనందయ్య మందులో ఎలాంటి హానికర పదార్థాలు లేవని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం CCRAS అధ్యయనం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Anandaiah corona medicine, Andhra Pradesh, Chinna Jeeyar Swamy, Covid-19

  ఉత్తమ కథలు