CHINESE PIGEONS TENSION IN ANDHRA PRADESH AND ODIHSA TODAY ONE PIGEON FOUND IN PRAKASAM DISTRICT NGS GNT
Chinese Pigeon: నిన్న ఒడిషా.. నేడు ఆంధ్రప్రదేశ్.. కలకలం రేపుతున్న చైనా పావురాలు.. !
చైనా పావురాల కలకలం
Chinese Pigeon: భారత దేశంలో చైనా పావురాలు ప్రవేశించడం కలకలం రేపుతోంది. నిన్న ఒడిశా లో ఓ పావురం కనిపిస్తే.. ఇవాళ ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పావురం భయపెట్టింది. వీటిపై చైనా ట్యాగ్ ఉండడంతో ఏం జరుగుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి. చైనా మళ్లీ కుట్రలకు దిగుతోందా అని కోణం పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Chinese Pigeon in Andhra Pradsh: శాంతికి చిహ్నంగా పావురాలను చెబుతాం.. కానీ అలాంటి పావురాలు ఇప్పుడు దేశంలో కలకలం రేపుతున్నాయి. ఆ పావురాలు ఏం చేశాయి అనుకుంటున్నారా..? తాజాగా దర్శనమిస్తున్న పావురాలకు చైనా ట్యాగ్ లు ఉండడమే ఈ భయానాకి కారణం.. నిన్న ఒడిషాలో ఇలాంటి పావురం ఒకటి కనిపిస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు... కాని .ఇవాళ ప్రకాశం జిల్లా చీమకుర్తి లో మరో పావురం కనిపించింద. దీంతో ఈ పావురాళ్లతో దేశానికి ముప్పు పొంచి ఉందా..? డ్రాగన్ కంట్రీ ఏమైనా వ్యూహ రచన చేస్తోందా..? వీటి వెనుక ఉగ్ర కుట్ర దాగుందా..? లేకపోతే రాజులకాలంలో ఉన్నట్టు ఇవి గూఢాచారి పావురాలా..? ఇలా ఎన్నో అనుమానాలు మొదలవుతున్నాయి. తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లా చీమకుర్తి లో దొరికిన పావురం కాలిపై ఎల్లో కలర్ రబ్బర్ ట్యాగ్..AIR 2019 2207 అని రాసి ఉంది. అయితే ఇది కూడా చైనా దేశానికి చెందిన పావురమే అని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇలాంటి పావురాలు వరసగా దర్శనమిస్తుండడంతో.. అన్నింటిపైనా చైనాకు సంబందించి ట్యాగ్ ల్లా కనిపిస్తుండడంతో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు..
ముందుగా చీమకుర్తిలో ఈ పావురాన్ని చూసి స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సరిగ్గా నాలుగు నెలల క్రితం తిరుపతి నుంచి కడపకు వచ్చే మార్గంలో అతనికి ఇలాంటి ట్యాగ్ లు వేసి ఉన్న పావురం దొరికినట్లు చెబుతున్నాడు. దీని ఒక కాలి ట్యాగ్ పై LOFT26, రెండవ కాలిపై LOFT 26 IN 2021 అని రాసి ఉందని ఓ యువకుడు చెబుతున్నాయి. అయితే ఆ కోడ్ గురించి పట్టించుకోకుండా పావురానికి అందరూ ఆహారం వేసేవారని.. పాపం అది డిసెంబర్లో మరణించిందని ఓ యువకుడు చెబుతున్నాడు.
ఇక నిన్నఅనుమానాస్పందంగా తిరుగుతున్న కొన్ని పావురాలను ఒడిశాలో గుర్తించారు. వాటి కాలికి ఉన్న ఆ పచ్చ కట్టు ఏంటా అని ఆరా తీశారు. అనుమానం వచ్చిన ఒడిషా వాసులు ఈ పావురాన్ని పట్టి ఆ కాలికున్న కట్టు విప్పి చూశారు. ఆ ట్యాగ్ లో VHF- వైజాగ్ 19742021 అని ముద్రించి ఉంది. స్థానికులిచ్చిన సమాచారం తో పోలీసులు ఈ పావురాన్ని పట్టుకెళ్లారు. ఇక పూరీ జిల్లా- హరే కృష్ణ పుర్ పంచాయితీలో రహంగిరియా గ్రామస్తులకు సోమవారం దొరికిన పావురం కాలికి.. మరో ఆశ్చర్యకరమైన ట్యాగ్ కనిపించింది. దీని కాలికి 37 అనే సంఖ్యతో పాటు.. చైనా లిపితో కూడిన అల్యూమినియం ట్యాగ్ కనిపించింది. మంగళవారం నాడు ఈ పావురాన్ని గుర్తించి.. తమ వెంట పట్టుకు పోయారు పూరీ పోలీసులు.
ఇలా వరుసగా దేశంలో పావురాలు అనుమానాస్పదంగా కనిపిస్తుండడం తీవ్ర ఆందోళన పెంచుతోంది. ప్రస్తుతం సరిహద్దులో ఇండియాతో కయ్యానికి చైనా కాలు దువ్వుతోంది. పాకిస్థాన్ కూడా మనల్ని దెబ్బతీయాలని చూస్తోంది. ఇలాంటి సమయంలో ఇలా అర్థంకాని భాషలో కోడ్ తో ఉన్న పావురాలు కనిపిస్తుండడం తీవ్ర ఆందోళన పెంచుతోంది. చైనా తాము ప్రయోగించే రాకెట్ లాంచర్ల దూరాన్ని పరీక్షించేందుకే ఇలా చేస్తోందనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది. ఈ పావురాలతో ఏం చేస్తున్నారు. ఇవి ఎవరికి సమాచారం మోసుకుపోతున్నాయి. ఇందులో ఏదో పెద్ద డ్రాగన్ కుట్ర ఉన్నట్లుగా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.