CHILLY FARMERS FACING LOSSES EVEN MARKET HAS HIGH PRICE DUE TO THESE REASONS FULL DETAILS HERE PRN GNT
AP News: క్వింటాల్ మిర్చి రూ.60 వేలు... అయినా నష్టపోతున్న రైతలు.. కారణం ఇదే..!
నష్టాల బాటలో మిర్చి రైతులు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పండించే వాణిజ్య పంటలలో మిర్చి పంటది అగ్రస్థానం. సాధారణం గా మిర్చి సాగుకు ఎకరాకు లక్షన్నర నుండి రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది. వాతావరణం అనుకూలించి సక్రమంగా పంట చేతికి అందితే ఎకరాకు 15 నుండి 20 క్వింటాళ్ళ వరకు దిగుబడి వస్తుంది.
ఈ భూమ్మీద ఉద్యోగాలు (Jobs) చేసేవారు బాగానే ఉంటారు. వ్యాపారాలు చేసేవారు చక్కగానే బ్రతుకుతారు. కూలీపనులు చేసేవాళ్లు కూడా హాయిగానే ఉంటున్నారు. కానీ రైతుల (Farmers) కి మాత్రం సీజన్ ఎలాంటిదైనా... పరిస్థితులు ఎలా అన్నా ఐదువేళ్లు నోట్లోకి వెళ్లే దారి కనిపించడం లేదు. ధర ఉంటే దిగుబడి ఉండదు.. దిగుబడి ఉంటే ధర ఉండదు.. అన్నీ సరిగ్గా ఉంటే దళారుల చేతిలో మోసపోవడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పండించే వాణిజ్య పంటలలో మిర్చి పంటది అగ్రస్థానం. సాధారణం గా మిర్చి సాగుకు ఎకరాకు లక్షన్నర నుండి రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది. వాతావరణం అనుకూలించి సక్రమంగా పంట చేతికి అందితే ఎకరాకు 15 నుండి 20 క్వింటాళ్ళ వరకు దిగుబడి వస్తుంది.
క్వింటాల్ కి 10వేల వరకు ధర పలికినా లక్షన్నర నుండి రెండులక్షల రూపాయల మేర ఆదాయం పొందుతారు. కానీ వాస్తవంలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. అడుగడుగునా రైతులను అటు వ్యాపారులు, ఇటు దళారులు మోసగిస్తూనే ఉన్నారు. వీరికి తోడు అకాలవర్షాలు వివిధరకాల తెగుళ్ళు రైతుల జీవితాలను ఛిధ్రం చేస్తున్నాయి. నకిలీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు, పెరిగిన కూలి రెట్లు పెట్టుబడులు ఆకాశంవైపు పరిగెడుతుంటే.. తెగుళ్ళు బారిన పడి పంటదిగుబడి మాత్రం పాతాళం వైపు పయనిస్తుంది.
గత ఏడాది అకాల వర్షాలు,వైరస్ తెగులు,నల్లి వలన మిర్చి పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి.మిగిలిన కొద్దిపాటి పంటలు కూడా అరకొర దిగుబడులే వచ్చాయని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం తేజరకం మిరప క్వింటాల్ కి 20 వేల రూపాయలు ధరపలుకు తుండగా బ్యాడిగ రకం 55 వేల నుండి 65 వేల రూపాయల వరకు ధరపలుకుతుంది. ఐతే ఎకరాకు నాలుగు క్వింటాలు కూడా దిగుమతి రావడంలేదని భారీగా ధరలు పలుకు తున్నా దిగుబది తగ్గడంతో రైతుకు ఎకరాకు ఎంత లేదన్నా 40-50 వేల రూపాయలు నష్టం తప్పడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీని పర్యావసానమే గడచిన వారం పదిరోజులలో ఒక్క గుంటూరు జిల్లా (Guntur District) లోని ముగ్గురు మిర్చి రైతులు బలవన్మరణానికి పాల్పడిన సంఘటనలు వెలుగు చూశాయి. ఇక నైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మిర్చిరైతులను ఆదుకోవాలని, పండించిన పంటలను నిల్వచేసుకునేందుకు సరైన వసతులు కల్పించాలని, గుంటూరు మిర్చ్ యార్డ్ నందు దళారుల ప్రమేయం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే మరింత మంది మిర్చి రైతుల ప్రాణాలు గాల్లోకలిసి పోయే ప్రమాదం లేకపోలేదని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.