Home /News /andhra-pradesh /

CHICKEN PRICES COME DOWN IN ANDHRA PRADESH MAINLY EFFECTED KARTIKAMASAM NGS

Chicken: నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన చికెన్ ధర.. కారణం ఇదేనా..?

Chicken Price: ఓ వైపు పెట్రోల్ వందకు దిగను అంటోంది. తాజాగా టమోటా ధరలు కూడా సెంచరీని తాకాయి. ఇలా అన్ని రేట్లు పెరిగి భయపెడుతున్నాయి.. ఇలాంటి సమయంలో చికెన్ ధరలు ఊరనిచ్చాయి. కార్తీకమాసం కావడంతో మాంసం కొనుగోళ్లు చాలా తగ్గాయి. సాధారణ నెలల్లో కస్టమర్లతో చికెన్ షాపులు కళకళలాడేవి.. కానీ కార్తీకమాసం ప్రారంభం నుంచి కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి.

ఇంకా చదవండి ...
    Chicken Price in Andhra Pradesh: సామాన్యుడి జీవితం దుర్భదమైంది. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కిచన్ నిండడం లేదు.. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) లోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) నూ అదే పరిస్థితి. డబ్బులు భారీగా ఖర్చు అవుతున్నా కిచెన్ నిండడం లేదు.. తాజాగా కార్తీకమాసం (Karitikamasam) కావడంతో.. అన్ని రేట్లకు రెక్కలు వచ్చాయి.. ముఖ్యంగా కూరగాయలపై రేట్ల ప్రభావం పడింది. దాదాపు అన్ని కూరగాయల రేట్లు రెట్టింపు అయ్యాయి. అయితే ఇలా అన్ని రేట్లు పెరుగుతుంటే.. నాన్ వెజ్ ప్రియులకు మాత్రం శుభవార్త అవుతోంది. భారీగా చికెన్ ధరలు (Chicken price) తగ్గాయి. సాధారణ నెలల్లో కస్టమర్లతో చికెన్ షాపులు కళకళలాడేవి.. కానీ కార్తీకమాసం ప్రారంభం నుంచి కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి.

    శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో చాలామంది మాంసం ముట్టరు. దీని కారణంగానే మాంసం కొనుగోళ్లు భారీగా తగ్గాయి. దీంతో చికెన్ రేటు దిగొచ్చింది. కేజీ చికెన్ రూ.170కే లభిస్తుంది. ధర తగ్గినా కస్టమర్లు రావడం లేదని షాప్ నిర్వాహకులు చెబుతున్నారు.

    ఇదీ చదవండి : బాబోయ్ వానలు.. ఏపీకి పొంచి ఉన్న జవాద్ ముప్పు. వెనక్కి వెళ్తున్న సముద్రం

    కార్తీకమాసంలో మాంసం కొనుగోళ్లు తగ్గుతాయనే అవగాహనా లేకుండా బ్రాయిలర్ కోళ్లు పెంపకం చేపట్టిన వారు నష్టపోతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. ఇదే విషయంపై రైతులు మాట్లాడుతూ కోడిని ఒక సైజు వరకే పెంచాలని ఆ సైజు రాగానే అమ్మేయాలని.. ఆలా అమ్ముకోకుండా ఉంచితే దానికి మేత దండగ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    ఇదీ చదవండి : వివాదాలు.. వినతులు.. నేడు తిరుపతిలో అమిత్‌షా అధ్యక్షతన సదరన్‌ జోనల్ మీట్.

    కార్తీకమాసం మొత్తం మాంసం మార్కెట్ డల్‌గానే ఉంటుందని చెబుతున్నారు. ఇతర మాంసపు ఉత్పత్తులతో పో సా మల్చుకుంటే కోళ్ల పెంపకం దారులు ఈ నెలలో ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. కేజీ చికెన్ రూ.170కి రావడం నాలుగు నెలల కాలంలో ఇదే కనిష్టం.

    ఇదీ చదవండి : సోలార్ ఉన్నా చలినీళ్లతోనే విద్యార్థుల స్నానాలు.. ఎందుకంటే?.

    ప్రస్తుతం చికెన్ రేట్లు తగ్గినా.. గత రెండు నెలలు మాత్రం భయపెట్టాయి. అంతకుముందు కరోనా మొదటి వేవ్ లో చికెన్ ధరలు దారుణంగా పడిపోయాయి. కేజీ 20కి కూడా అమ్మిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత వైద్యులు చికెన్ శక్తివంతమైన ఆహారం అని.. చికెన్ ద్వారా కరోనా రాదని తేల్చి చెప్పడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంతో దాణ రేట్లు అమాంతం పెరిగాయి. కోడికి వేసే దానాల్లో ప్రధానంగా సొయా, మొక్కజొన్న ఉంటుంది. కరోనాకి ముందు కేజీ సొయా రూ.35 కి లభించేది.. కానీ ప్రస్తుతం కేజీ సొయా రూ.105గా ఉంది. ఇక రూ.12, 13 రూపాయలకు లభించే కేజీ మొక్కజొన్న దాన ఇప్పుడు రూ .23 కి చేరింది. దీంతో ఉత్పత్తి భారం భారీగా పెరిగింది. దీంతో బ్యాచ్ వేయడమే మానేశారు కోళ్లపెంపకం దారులు. దీంతో కేజీ చికెన్ రూ.300 చేరింది.

    ఇదీ చదవండి : చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పదవి కోసం ఫైట్.. వాట్సప్ లో వైరల్ పోస్టులు

    మళ్లీ ఇప్పుడు కార్తీక మాసం రావడంతో చికెన్ రేట్లు మెళ్లిగా దిగి వస్తున్నాయి.300 దాటిన చికెన్ ధర 150 కిందకు దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు..
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Chicken

    తదుపరి వార్తలు