Home /News /andhra-pradesh /

CHHATTISGARH YOUNG MAN TAKE UP CYCLE YATRA TO CREATE AWARENESS ON FIT INDIA PROGRAM AND HE IS THE BIG FAN OF PM NARENDRA MODI FULL HERE PRN TPT

Tirupati: ప్రధాని మోదీ కోసం 18వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర.. యువకుడి సాహసానికి శభాష్ అనాల్సిందే..!

రాజీవ్

రాజీవ్

Tirupati: సినిమా నటులకున్నట్లు రాజకీయ నాయకులకు కూడా వీరాభిమానులుంటారు. వారి పేరును టాటూల్ వేయించుకోవడం, బ్యానర్లు కట్టడం, పుట్టిన రోజు వేడుకలు చేయడం వంటివి చేస్తుంటారు. అంతేకాదు తమ నాయకుడుని ఎవరైనా విమర్శిస్తే కొట్టడానికి కూడా వెనుకాడరు. కానీ ఓ యువకుడు మాత్రం తన అభిమాన నాయకుడి కోసం వినూత్న కార్యక్రమం చేపట్టాడు.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, News18, Tirupati

    సాధారణంగా సినిమా హీరోలకు వీరాభిమానులుంటారు. వారి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అంతేకాదు వారు ఏదైనా సోషల్ సర్వీస్ మొదలుపెడితే ఫ్యాన్స్ కూడా పాలో అవుతారు. అంతేకాదు హీరోలను కలిసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఐతే సినిమా నటులకున్నట్లు రాజకీయ నాయకులకు కూడా వీరాభిమానులుంటారు. వారి పేరును టాటూల్ వేయించుకోవడం, బ్యానర్లు కట్టడం, పుట్టిన రోజు వేడుకలు చేయడం వంటివి చేస్తుంటారు. అంతేకాదు తమ నాయకుడుని ఎవరైనా విమర్శిస్తే కొట్టడానికి కూడా వెనుకాడరు. కానీ ఓ యువకుడు మాత్రం తన అభిమాన నాయకుడి కోసం వినూత్న కార్యక్రమం చేపట్టాడు. ఓ పథకం గురించి దేశవ్యాప్తంగా వివరించే పనికి శ్రీకారం చుట్టాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రవేశపెట్టిన ఓ కార్యక్రమం గురించి ప్రచారం చేసేందుకు ఏకంగా 18వేల కిలోమీటర్ల సైకిల్ యాత్రను చేపట్టాడు.

    వివరాల్లోకి వెళితే.... నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానమంత్రి అయిన తరువాత ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రారంభించారు. అలా కొన్ని కార్యక్రమాల్లో 2019 ఆగస్టు 29న ఫిట్ ఇండియా (Fit India) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలోని ప్రజలు ఫిట్ గా ఉండేందుకు ఆయన ఇనిషియేషన్ తీసుకున్నారు. ఈ పథకానికి ఆకర్షితుడైన ఛత్తీస్ గడ్ చెందిన రాజీవ్ అనే యువకుడు ఇప్పటికే రెండు మార్లు పాదయాత్ర చేపట్టి పీఎం నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నాలు చేశాడు. కానీ కుదరలేదు. ఈసారి ప్రధానిని కలిసేందుకు సైకిల్ యాత్ర చేపట్టాడు. ఛత్తీస్ గడ్ రాష్ట్రం నుంచి రాజీవ్ ఆరు నెలల సైకిల్ యాత్ర ప్రారంభించాడు.

    ఇది చదవండి: ఏపీలో పురాతనమైన కాలేజీ ఇదే..! హిస్టరీ తెలిస్తే వారెవా అంటారు..


    ఛత్తీస్ గడ్ లోని తన స్వగ్రామం నుంచి మార్చి 12న బలుదేరిన రాతీవ్.., ఆగస్టు 15వ తేదీన తన సైకిల్ యాత్ర ముగిస్తానని తెలిపాడు. 18000 వేల కిలోమీటర్లు 16 రాష్ట్రాలు తిరుగుతూ శుక్రవారం తిరుపతి జిల్లా మీదుగా రేణిగుంటకు చేరుకున్నాడు. నరేంద్ర మోడీ ప్రారంభించిన ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సైకిల్ యాత్ర ప్రారంభించినానని చెప్పాడు. ప్రజలకు ఆరోగ్య, శారీరక,మానసిక పరమైన విషయాలను వివరిస్తానని చెప్పాడు. ఆరు నెలల సైకిల్ యాత్ర ద్వారా నరేంద్ర మోడీని కలవాలని సంకల్పంతో బయల్దేరానని చెప్పాడు. ఒక రోజుకు వంద నుంచి 130 కిలోమీటర్ల వరకు యాత్ర కొనసాగిస్తానని తెలిపారు.

    ఇది చదవండి: వీళ్లవి చేతులా..! మంత్రదండాలా..! మట్టితో మాణిక్యాలు సృష్టిస్తున్నారు.. ఆ కళకు ఫిదా అవ్వాల్సిందే..!


    ప్రస్తుతం ఏపీ నుంచి సైకిల్ మీదే ఒడిసా వెళ్తున్నట్లు వివరించాడు రాహుల్. తన అభిమాన నాయకుడిని కవలడం కోసం ఎన్నిసార్లు అయిన దేశ వ్యాప్తంగా యాత్ర చేయడానికసిద్ధాంగా ఉన్నానని తెలిపారు. ఆగస్ట్ 15న ప్రధాని మోదీని తప్పకుండా కలుస్తానని దీమా వ్యక్తం చేస్తున్నాడు రాజీవ్. మరి మూడో ప్రయత్నంలోనైనా రాజీవ్.. ప్రధానిని కలవాలని కోరుకుందాం..!
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, PM Narendra Modi, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు