చెవిరెడ్డికి తప్పిన ముప్పు... వాహనం బోల్తా

వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ వప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రమాదం తప్పింది.

news18-telugu
Updated: January 25, 2020, 1:12 PM IST
చెవిరెడ్డికి తప్పిన ముప్పు... వాహనం బోల్తా
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, (File)
  • Share this:
వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ వప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రమాదం తప్పింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెన్నై వెళ్తున్న సమయంలో పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనం బోల్తా పడింది. చెవిరెడ్డి ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది. దీంతో అందులోని భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి. వెంటనే వారిని తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ఎస్కార్ట్ ముందున్న వాహనంలో చెవిరెడ్డి ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెన్నైలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది. చెవిరెడ్డి చంద్రగిరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను ప్రభుత్వ విప్‌గా నియమించారు. దీంతో నిబంధనల ప్రకారం చెవిరెడ్డికి ఎస్కార్ట్ వాహనాన్ని పోలీసులు కేటాయించారు.

First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు