చెన్నై నుంచి శ్రీవారి గొడుగుల ఊరేగింపు... మరో నాలుగురోజుల్లో తిరుమలకు

ఈ ఊరేగింపు 3వ తేదీన తిరుమలకు చేరుకుని అనంతరం శ్రీవారి ఆలయం ముందు దేవస్థాన అధికారులకు అందజేయనున్నారు.

news18-telugu
Updated: September 29, 2019, 8:07 AM IST
చెన్నై నుంచి శ్రీవారి గొడుగుల ఊరేగింపు... మరో నాలుగురోజుల్లో తిరుమలకు
చెన్నై నుంచి శ్రీవారి గొడుగుల ఊరేగింపు ప్రారంభం
news18-telugu
Updated: September 29, 2019, 8:07 AM IST
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి గొడుగుల ఊరేగింపు అత్యంత వైభంగా కొనసాగింది. చెన్నై హిందూధర్మార్థ సమితి ఆధ్వర్యంలో తమిళనాడు ర్రాష్ట్రం చెన్నై హైకోర్టు సమీపంలోని పూలబజారు చెన్నకేశవ స్వామి ఆలయంనుండి ఈ గొడుగుల ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమాన్ని  విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, స్వతమనందేంద్ర స్వామి ప్రారంభించారు.  చెన్నై హిందుదర్మార్థ సమితి ట్రస్టీ ఆర్.ఆర్.గోపాల్ జీ మరియు మేనేజింగ్ ట్రస్టీ వేదాంతం జీ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలలో శ్రీవారి ఊరేగింపులో స్వామివారికి అలంకరించేందుకు గొడుగులను చెన్నై నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి దేవస్థాన అధికారులకు అందజేయడం జరుగుతోంది.

చెన్నైలో శ్రీవారి గొడుగుల ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న స్వరూపానంద స్వామి


చెన్నై పూలబజారు సమీపంలోని చెన్నకేశవ స్వామి ఆలయంనుండి 11 గొడుగులకు ప్రత్యేక పూజలు చేసి అక్కడనుండి రహదారులలో నడుచుకుంటూ ఊరేగింపుగా తిరుమలకు బయలుదేరాయి. చెన్నకేశవ ఆలయం వద్ద విశాఖ శారదా పీఠం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి,  స్వతమనందేంద్ర స్వామి వారు శ్రీవారికి సమర్పించే గొడుగులకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపును ప్రారంభించారు.

చెన్నైలో శ్రీవారి గొడుగుల ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న స్వరూపానంద స్వామి
అనంతరం గొడుగులు ఊరేగింపులో రహదారి పొడవునా లక్షలాదిమంది భక్తుల గోవిందనామ స్మరణతో గొదుగులను దర్శించుకుని గొడుగులను తిరుమలకు సాగనంపారు. ఈ  ఊరేగింపు 3వ తేదీన తిరుమలకు చేరుకుని అనంతరం శ్రీవారి ఆలయం ముందు దేవస్థాన అధికారులకు అందజేయడం జరుగుతుందని హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్.ఆర్.గోపాల్ జీ తెలిపారు.
First published: September 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...