Chandrayaan 2 : చంద్రుడిపై కాలు పెట్టి 50 ఏళ్లు పూర్తి... రేపే చంద్రయాన్ 2 ప్రయోగం

ISRO Chandrayaan-2 : సాంకేతిక సమస్యను సెట్ చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు... ఈసారి మాత్రం కచ్చితంగా ప్రయోగం వాయిదా పడదని చెబుతున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: July 21, 2019, 5:53 AM IST
Chandrayaan 2 : చంద్రుడిపై కాలు పెట్టి 50 ఏళ్లు పూర్తి... రేపే చంద్రయాన్ 2 ప్రయోగం
చందమామ (Image : NASA)
Krishna Kumar N | news18-telugu
Updated: July 21, 2019, 5:53 AM IST
సాంకేతిక కారణాలతో చంద్రయాన్ 2 ప్రయోగం జులై 15న వాయిదా పడింది. ఆ సమస్యపై దాదాపు మూడ్రోజులపాటూ ఇస్రో, షార్ శాస్త్రవేత్తలంతా దృష్టి సారించారు. మొత్తానికి అన్నీ సరిచేసి... అంతా పర్‌ఫెక్ట్‌గా ఉండేలా చేసుకున్నారు. తాజాగా మరోసారి రిహార్సల్ చేశారు. 100 శాతం కచ్చితత్వం ఉన్నట్లు తేలింది. అందువల్ల జులై 22న సోమవారం మధ్యాహ్నం 2:43 గంటలకు ప్రయోగం జరపబోతున్నట్లు ఇస్రో అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఐతే... జులై 15న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో జరిగే ప్రయోగం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తోపాటూ... కోట్ల మంది ఆదివారం అర్ధరాత్రి నుంచీ ఆసక్తిగా ఎదురుచూశారు. వారంతా నిరాశ చెందారు. చంద్రయాన్-2 అనేది అత్యంత సంక్లిష్టమైన మిషన్ అంటున్న శాస్త్రవేత్తలు... ఇలాంటి ప్రయోగాలు చేపట్టినప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్‌లలో లోపాలు తలెత్తడం సహజం అని తెలిపారు. ఇదివరకు అమెరికా, రష్యాలు చేపట్టిన ప్రయోగాల్లోనూ ఇలాంటి సమస్యలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు.


చంద్రయాన్ 2 పూర్తి వివరాలు : చంద్రయాన్ 2 అనేది... చందమామ దక్షిణ ధ్రువాన్ని పరిశోధించబోతున్న తొలి మిషన్. ఇందులో ఆర్బిటర్, విక్రం అని పిలిచే ల్యాండర్, ప్రజ్ఞాన్ అనే రోవర్ ఉంటాయి. ఇస్రోని స్థాపించిన విక్రమ్ సారాభాయ్ పేరు మీద ల్యాండర్‌కు విక్రమ్ అని పేరు పెట్టారు. ప్రజ్ఞాన్ అంటే తెలివితేటలు, నాలెడ్జ్ అని అర్థం. చంద్రయాన్ 2 బరువు 3,877 కేజీలు. చంద్రయాన్ 1 కంటే ఇది నాలుగు రెట్లు బరువు ఎక్కువ. చంద్రయాన్ 1 సాంకేతిక లోపంతో చంద్రమామపై కూలిపోయింది. చంద్రయాన్ 2 అనేది రాకెట్ టెక్నాలజీ ద్వారా... ల్యాండర్‌ను చందమామపై దించబోతోంది. ఇందుకోసం సరైన ప్రదేశాన్ని ఎంచుకుంటారు. రెండు పగులు లోయల (మాంజినస్-సి, సింపెలియస్ ఎన్) మధ్య ఉండే ఎత్తైన మైదానంలో... ల్యాండర్ దిగుతుంది. సెప్టెంబర్ 6న ఇది జరుగుతుంది. ఈ ప్రాజెక్టుకు అయిన ఖర్చు రూ.978 కోట్లు. ల్యాండర్, రోవర్ కలిపి... 14 రోజులు పనిచేస్తాయి. చంద్రుడి చుట్టూ తిరిగే ఆర్బిటర్ మాత్రం ఏడాది పనిచేస్తుంది.



Moon Landing 50th Anniversary : చందమామపై మనిషి కాలు పెట్టి... 50 ఏళ్లు పూర్తైంది. అపోలో 11 మిషన్ కోసం 4లక్షల మంది శాస్త్రవేత్తలు, టెక్నీషియన్లు పనిచేశారు. చివరకు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకెల్ కొల్లిన్స్ మాత్రమే చందమామ చెంతకు వెళ్లేందుకు అనుమతి లభించింది. కోట్ల మంది ఆశల్ని, ఆశయాల్నీ మోసుకెళ్తూ... ఆ ముగ్గురూ... జాబిల్లి చెంతకు చేరారు. జులై 16, 1969న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచీ శాట్రన్ V రాకెట్... నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.
Loading...
చందమామ చుట్టూ తిరిగిన తర్వాత... ది ఈగిల్ అని పిలిచే మాడ్యూల్... చందమామ ఉపరితలం వైపు 13 నిమిషాలు ప్రయాణించింది. ఈ జర్నీలో రెండు కీలక సమస్యలు ఎదురయ్యాయి. మొదట... నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బుజ్ ఆల్డ్రిన్‌కి భూమితో రేడియో కాంటాక్ట్స్ తెగిపోయాయి. ఆన్ బోర్డ్ కంప్యూటర్‌లో ఎర్రర్ మెసేజ్ కనిపించింది. రెండో సమస్య ఏంటంటే... ఇంధనం సరిపోని పరిస్థితి. అయినప్పటికీ మాడ్యూల్‌ని విజయవంతంగా చందమామపై ఉన్న పగులు లోయ సీ ఆఫ్ ట్రాంక్విలిటీలో జులై 20న విజయవంతంగా దింపగలిగారు.

కమాండ్ మాడ్యూల్ పైలట్ అయిన మైకెల్ కొల్లిన్స్... మాడ్యూల్‌లోనే ఉండిపోగా... నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బుజ్ అల్డ్రిన్ మాత్రం చందమామపై దిగాలని నిర్ణయించారు. మాడ్యూల్ నుంచీ బయటకు వచ్చి... చందమామపై తొలి అడుగు పెట్టిన వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్. తాను వేస్తున్న ఈ చిన్న అడుగు... మానవ జాతికి పెద్ద అడుగు అని అభివర్ణించారు. ముగ్గురు వ్యోమగాములూ... జులై 25, 1969న భూమికి తిరిగొచ్చారు.
First published: July 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...