మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు చంద్రబాబు లేఖ.. ఎందుకంటే..

షోలాపూర్‌లో చిక్కుకున్న తెలుగు ఉద్యోగులను ఆదుకోవాలని ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. దాదాపు 200 మంది ఉద్యోగులు 30 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నారని, వీరందరికీ కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని లేఖలో తెలిపారు.

news18-telugu
Updated: May 6, 2020, 8:56 PM IST
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు చంద్రబాబు లేఖ.. ఎందుకంటే..
చంద్రబాబునాయుడు (File)
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ నిబంధనల వల్ల బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. ప్రజారవాణ వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోవడంతో ఆయా రాష్ట్రాల పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోకి ప్రజలను అనుమతించకపోవడంతో ఎక్కడి కూలీలు అక్కడే ఇరుక్కుపోయారు. అయితే ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు లేఖ రాశారు. షోలాపూర్‌లో చిక్కుకున్న తెలుగు ఉద్యోగులను ఆదుకోవాలని ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. దాదాపు 200 మంది ఉద్యోగులు 30 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నారని, వీరందరికీ కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని లేఖలో తెలిపారు. ఆ ఉద్యోగులందరినీ స్వస్థలాలకు పంపాలని కోరారు. స్వస్థలాలకు వెళ్లే వారికి వసతితో పాటు భోజన సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు.
First published: May 6, 2020, 8:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading