ఏపీలో గెలిచేది టీడీపీ... చంద్రబాబు మళ్లీ సీఎం... ఓ పత్రిక కథనం

AP Assembly Elections 2019 : చంద్రబాబుకు గురు బలం పుష్కలంగా ఉందంటున్న పండితులు... జగన్‌కి జాతకం బాలేదంటున్నారు. పవన్ కల్యాణ్‌కి మెజార్టీ ఆదరణ లేదని విశ్లేషిస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: March 29, 2019, 5:58 PM IST
ఏపీలో గెలిచేది టీడీపీ... చంద్రబాబు మళ్లీ సీఎం... ఓ పత్రిక కథనం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
  • Share this:
గ్రహబలం ఉన్నవారే అధికారాన్ని చేపట్టగలరంటోంది ఆంధ్రజ్యోతి పత్రిక. ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు టీడీపీ అధినేత చంద్రబాబుకి అనుకూలంగా ఉంటాయంటూ ఆ పత్రిక ప్రత్యేక కథనాన్ని రాసింది. ఏప్రిల్‌ 20, 1950న పుట్టిన చంద్రబాబు జాతకంలో 9వ స్థానంలో గురు, శుక్రులు, దశమంలో రాహువు, 11వ స్థానంలో రవి, బుధుడు వుండటం గొప్ప యోగంగా జ్యోతిష పండితులు చెబుతున్నారని కథనంలో తెలిపింది. జనాకర్షణకు 7వ స్థానం ప్రధానమనీ.... రాజ్యాధికారానికి 10వ స్థానం ప్రధానమనీ చెబుతూ.... ఈ రెండు స్థానాలకూ అధిపతి అయిన గురువు 9వ స్థానంలో శుక్రుడితో కలిసి వుండటం చంద్రబాబుకి కలిసొస్తోందని వివరించింది. 28 ఏళ్లకే రాష్ట్ర మంత్రి పదవి చేపట్టడానికి, పదేళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, గత ఐదేళ్లుగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటానికి గురుబలమే కారణమని పండితులు చెబుతున్నారని తెలిపింది. 9, 10, 11 స్థానాల్లో మంచి గ్రహాలు ఉండటం చంద్రబాబుకి రాజయోగం తెచ్చాయని కొందరు పండితులు విశ్లేషిస్తున్నట్లు ఆ పత్రిక వివరించింది.

ప్రస్తుతం చంద్రబాబుకు శని మహాదశలో, గురువు అంతర్దశలో శని విదశ నడుస్తుందన్న ఆంధ్రజ్యోతి.... 2014లో శని మహాదశలో చంద్ర అంతర్దశ వున్న సమయంలో కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని వివరించింది. ప్రస్తుతం అదే శని మహాదశలో గురు అంతర్దశ, శని విదశ వుండటం వల్ల మొదట ప్రతికూలంగా కనిపించినా చివరి నిమిషంలో సానుకూల ఫలితాలు సాధించి, తిరిగి అధికారం చేపట్టే అవకాశం వుందని మెజారిటీ జ్యోతిష పండితులు అభిప్రాయపడుతున్నారనీ... ఆ కథనంలో ఉంది.


వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిది ఆరుద్ర 2వ పాదం, మిథున రాశి కావడంతో ఆయన జాతకంలో 9వ స్థానంలో శని వక్రించి ఉన్నారని కథనం తెలిపింది. 10వ స్థానంలో చంద్ర, కేతువులు ఉన్నారనీ గురువు 4వ స్థానంలో స్వక్షేత్రంలో రవితో కలిసి ఉన్నారనీ వివరించింది. దశమంలో చంద్రుడు ఉండటం, లగ్నాధిపతి బుధుడు, శుక్రుడితో కలిసి వుండటం, జనసంబంధాలకు సంబంధించిన 7వ స్థానాధిపతి గురువు 5వ స్థానంలో రవితో కలిసి వుండటం వల్ల జగన్‌కు ప్రజాదరణ ఏర్పడిందని వివరించింది. కన్యాలగ్న జాతకులకు పట్టుదల అధికం. లగ్నాధిపతి రవితో కలిసి వున్నాడు. రవిగ్రహం శక్తికి సంకేతం. ఆ పట్టుదల, శక్తి కారణంగానే ప్రజల్లో మంచి ఆదరణ సాధించగలిగారని జ్యోతిష పండితులు చెబుతున్నారని కథనంలో రాసివుంది.

ప్రస్తుతం జగన్మోహన్‌ రెడ్డికి శని మహాదశ నడుస్తుందనీ... ఏప్రిల్‌ 11కి గోచార శని ఆయన జన్మజాతకంలో ఉన్న గురువు మీదుగా సంచారం ప్రారంభిస్తాడనీ అందువల్ల జగన్‌కు ప్రస్తుతం రాజ్యాధికారం చేపట్టేంతటి గురుబలం లేదని జ్యోతిష పండితులు చెబుతున్నట్లు ఆ కథనంలో వివరణ ఉంది.


పవన్‌కల్యాణ్‌కు గురు మహాదశలో రవి అంతర్దశ నడుస్తున్నదనీ... ఏప్రిల్‌ రెండో వారం నుంచి శని విదశ ప్రారంభం అవుతుందనీ... దానికి తోడు ప్రస్తుతం ఏలినాటి శని కూడా నడుస్తున్నదనీ... అందువల్ల ఈ ఎన్నికల్లో ఆయన ఆశించిన ఫలితాలు సాధించలేకపోవచ్చని మెజారిటీ పండితులు చెబుతున్నట్లు ఆంధ్రజ్యోతి వివరించింది.ఇవి కూడా చదవండి :

ఇది వ్యూహకర్తల కాలం... నేతలను నడిపిస్తున్నది వాళ్లే... దేశవ్యాప్తంగా 300 కన్సల్టెన్సీలు

AP Elections 2019: ఒకే పార్టీ..ఒకే టికెట్..ఒకే స్థానం..నామినేషన్‌ వేసిన ముగ్గురు అభ్యర్థులు

AP Elections: కేఏ పాల్ నామినేషన్‌ను తిరస్కరించిన అధికారులు

ఏపీకి క్యూకట్టిన జాతీయ నేతలు..టీడీపీకి మద్దతుగా ప్రచారం..ఇదీ షెడ్యూల్
Published by: Krishna Kumar N
First published: March 26, 2019, 7:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading