హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

డిప్రెషన్‌లో నారా భువనేశ్వరి! -అవమానాన్ని తట్టుకోలేక -ఆ వైసీపీ నేతలు ఎవరంటే: నందమూరి కుటుంబం

డిప్రెషన్‌లో నారా భువనేశ్వరి! -అవమానాన్ని తట్టుకోలేక -ఆ వైసీపీ నేతలు ఎవరంటే: నందమూరి కుటుంబం

నారా భువనేశ్వరి పరిస్థితిపై నందమూరి కుటుంబీకుల వివరణ

నారా భువనేశ్వరి పరిస్థితిపై నందమూరి కుటుంబీకుల వివరణ

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదంతంపై టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతుండగా, నందమూరి కుటుంబం మీడియా ముందుకొచ్చి వైసీపీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. భువనేశ్వరిని అవమానించేలా మాట్లాడింది వీరేనంటూ వైసీపీకి చెందిన కీలక నేతల పేర్లను నందమూరి కుటుంబం వెల్లడించింది..

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి అధికార వైసీపీ నేతలు చేసిన కామెంట్లపై దుమారం అంతకంతకూ పెరుగుతున్నది. భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపర్చేలా వైసీపీ ఎమ్మెల్యేలు దారుణ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబు మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకోవడంతో ఈ ఉదంతం జాతీయ స్థాయిలోనూ చర్చీనాయంశమైంది. భువనేశ్వరిపై వైసీపీ వికృతానికి పాల్పడిందంటూ శనివారం నాడు ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. ఇదే అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణతోపాటు నందమూరి కుటుంబీకులు మీడియా ముందుకొచ్చారు. అసెంబ్లీలో చోటుచేసుకున్న ఉదంతంపై భువనేశ్వరి ఎంతగానో నొచ్చుకున్నారని, శుక్రవారం నాటి ఘటనలతో ఆమె కుంగుబాటుకు గురయ్యే పరిస్థితికి వెళ్లారని కుటుంబీకులు చెప్పారు. భువనేశ్వరి బాధను చూడలేకే మీడియా ముందుకొచ్చామని, ఆడబిడ్డను ఏడిపించిన వైసీపీకి విశ్వరూపం చూపిస్తామని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన కొందరు నేతల పేర్లను కూడా నందమూరి కుటుంబీకులు తొలిసారి ప్రస్తావించారు. వివరాలివి..

లోకేశ్ ఎలా పుట్టాడంటూ..

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం నాడు చోటుచేసుకున్న ఘటనలపై సర్వత్రా ఆందోళనలను వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదని వైసీపీ మంత్రులు వాదిస్తున్నారు. నిజానికి భువనేశ్వరి పేరును నేరుగా ప్రస్తావించకుండానే ‘లోకేశ్ ఎలా పుట్టాడో తేలాలి’అంటూ వైసీపీ ఎమ్మెల్యే కామెంట్లు చేయడం, ‘ఏయ్.. చంద్రశేఖర్ రెడ్డి.. వద్దు..’అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం అడ్డుచెప్పిన సందర్భం తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కొద్ది రోజుల కిందట వైసీపీ అనుకూల మీడియాతో మాట్లాడుడూ ‘నారా లోకేశ్ కు ఎలిమినేటి మాధవరెడ్డి పోలికలు ఉన్నాయ’ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాటి సభలోనూ వైసీపీ ఎమ్మెల్యేలు ఎలిమినేటి మాధవరెడ్డి హత్య గురించి తేలాలని కామెంట్లు చేశారు. ‘బాబాయి.. గొడ్డలి’అంటూ వివేకా హత్య కేసుతో సీఎం జగన్ ను ముడిపెడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేసిన దరిమిలా వైసీపీ నేతలు మాధవ రెడ్డి అంశాన్ని, లోకేశ్ పేరును ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సదరు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. దీనిపై..

Hyderabad : హీరోయిన్‌పై అత్యాచారం.. లైట్‌బాయ్ బాబు పన్నాగమిదే -shalu chourasiya కేసులో షాకింగ్ ట్విస్ట్


భువనేశ్వరికి అండగా నందమూరి ఫ్యామిలీ

అసెంబ్లీ సాక్షిగా తన భార్య భువనేశ్వరిపై దారుణంగా మాట్లాడారంటూ చంద్రబాబు ఆరోపించడం, ప్రెస్ మీట్ లో ఆయన బోరున విలపించడం తెలిసిందే. ఈ పరిణామాలపై భువనేశ్వరి సోదరుడు, వియ్యకుండు కూడా అయిన హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ లో నందమూరి కుటుంబానికి చెందిన పలువురు ముఖ్యులు కూడా పాల్గొన్నారు. అసెంబ్లీ ఉదంతం తర్వాత భువనేశ్వరి తీవ్రంగా బాధపడుతున్నారని, విలువలతో పెరిగిన ఆమెపై వైసీపీ వాళ్లు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడమేంటని నందమూరి కుటుంబీకులు ప్రశ్నించారు.

నారా భువనేశ్వరిపై దారుణ కామెంట్లు.. స్పీకర్ తమ్మినేని చర్యలు -చంద్రబాబుకు కౌంటర్ -లోకేశ్ పుట్టుకపై..!!


వంశీ, నాని పేర్లను ప్రస్తావిస్తూ..

అసెంబ్లీలో ఉన్నామో, పశువుల దొడ్డిలో ఉన్నామో అర్థం కానంతగా సభను వైసీపీ భ్రష్టుపట్టించిందని, రాజకీయాలతో సంబధం లేనివారిపై అనుచిత దాడికి దిగడం వైసీపీ కుసంస్కారానికి నిదర్శనమని నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. ఇంకోసారి తన సోదరిపై నీచపు మాటలు మాట్లాడితే వైసీపీ నేతల మెడలు విరగ్గొడగానని, ఆడవాళ్లను తెరపైకి తెచ్చి మైండ్ గేమ్ ఆడటం తప్పుడు విధానమని బాలయ్య హెచ్చరించారు. భువనేశ్వరి మరో సోదరుడు నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. ఇకపై తమ కుటుంబం జోలికి వచ్చే ఎవరినైనా వదిలిపెట్టబోమని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలు హద్దు మీరి మాట్లాడారని, వాళ్ల ఇళ్లలోని ఆడవాళ్లకు ఇలాంటి పరిస్థితి రావొద్దనే కోరుతున్నామని, అయినా హద్దులు మీరితే, తాము కూడా ఎంతదూరమైనా వెళతామని రామకృష్ణ హెచ్చరించారు.

చంద్రబాబు భార్యను అంత మాట అంటారా? -ఎన్టీఆర్ కుటుంబీకులు ఫైర్ -నారా భువనేశ్వరికి బీజేపీ నేత పురందేశ్వరి సహా..


బాధలో భువనేశ్వరి..

దేవాలయం లాంటి అసెంబ్లీని వైసీపీ నేతలు అపవిత్రం చేశారని, ఎన్టీఆర్ నెత్తురు పంచుకుని పుట్టిన భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, మళ్లీ ఇలాగే జరిగితే విశ్వరూపం చూపిస్తామని భువనేశ్వరి సోదరి లోకేశ్వరి అన్నారు. నందమూరి కుటుంబం ఏనాడైనా వైఎస్ విజయమ్మ, షర్మిలను ఏమైనా అనిందా? అని లోకేశ్వరి ప్రశ్నించారు. మహిళలకు ఎంతో గౌరవమిచ్చే ఎన్టీఆర్ కడుపున పుట్టిన బిడ్డను అసెంబ్లీలో ఇంత దారుణంగా అవమానించడాన్ని తెలుగువారంతా ఖండించాలని హరికృష్ణ తనయ సుహాసిని అన్నారు. ‘మహిళల గొప్పతనంపై ఎన్టీఆర్ ఎన్నో సినిమాలు తీశారు. మా అత్తలను చూసి మేం చాలా నేర్చుకున్నాం. భువనేశ్వరిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. చంద్రబాబు ఏడుస్తుంటే చూసి తట్టుకోలేకపోయాం..’అని నందమూరి వారసుడు చైతన్య కృష్ణ అన్నారు.

First published:

Tags: AP Assembly, Chandrababu Naidu, Nandamuri balakrishna, Nandamuri Family, Nara Bhuvaneshwari, TDP

ఉత్తమ కథలు