Home /News /andhra-pradesh /

CHANDRABABU PLEASE SWITCH ON FAN YSRCP MP VIJAYASAI REDDY SATIRES ON AP CM SK

'చెమటలు పడుతున్నాయ్..ఫ్యాన్ వేస్కోండి'...చంద్రబాబుపై విజయసాయి సెటైర్

విజయసాయిరెడ్డి, చంద్రబాబు

విజయసాయిరెడ్డి, చంద్రబాబు

టీడీపీలో చేరికలపైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాము వద్దనుకున్న నేతలే పసుపు పార్టీలో చేరుతున్నారంటూ ఎద్దేవా చేశారు. గాలి విసిరికొట్టినప్పుడు తాటు గింజలు కొట్టుకొస్తాయని...దానికే మురిసిపోతే ఎలా? అని అన్నారు.

    అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓ వైపు నేతలు జంపింగ్‌లు..మరోవైపు విమర్శల తాటాలతో రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు, ఫిర్యాదు చేసుకుంటున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టార్గెట్‌గా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

    ప్రభుత్వ కార్యాలయాల్లో వైసీపీ ఎన్నికల గుర్తు సీలింగ్‌ ఫ్యాన్‌ తొలిగించాలని ఎన్నికల అధికారులకు టీడీపీ ఫిర్యాదు చేయడంపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ ఫ్యాన్ గుర్తును చూస్తే చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయమంటూ ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు.
    ఫ్యాన్ గుర్తు చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రభుత్వ ఆఫీసుల్లో ఫ్యాన్లు తొలగించాలట. ఇంకా యుద్ధమే ఆరంభం కాలేదు. అప్పుడే చెమటలు కారుతున్నాయి. కాసేపు ఫ్యాన్ వేసుకోండి చల్లబడతారు. పోలింగ్‌ నాటికి ఇళ్లలోని ఫ్యాన్లను కూడా బలవంతంగా ఎత్తుకెళ్లేట్టున్నారు.
    విజయసాయిరెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు
    అటు టీడీపీలో చేరికలపైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాము వద్దనుకున్న నేతలే పసుపు పార్టీలో చేరుతున్నారంటూ ఎద్దేవా చేశారు. గాలి విసిరికొట్టినప్పుడు తాటు గింజలు కొట్టుకొస్తాయని...దానికే మురిసిపోతే ఎలా? అని అన్నారు. అవి తినడానికి పనికిరావని...మొలకెత్తవని చురకలంటించారు. ఓటమి భయంతో చంద్రబాబునాయుడు వణికిపోతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు.
    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Chandrababu naidu, Vijayasai reddy, Ysrcp

    తదుపరి వార్తలు