Home /News /andhra-pradesh /

కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌కు చంద్రబాబు ఫోన్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌కు చంద్రబాబు ఫోన్

అమిత్ షా, చంద్రబాబు

అమిత్ షా, చంద్రబాబు

చికిత్స అనంతరం ఆరోగ్యం కుదుటపడడంతో 31న తిరిగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇంటి నుంచే ఆయన విధులు నిర్వహిస్తున్నారు అమిత్ షా.

    కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ చేశారు. కరోనా నుంచి కోలుకున్న అమిత్ షాను ఆయన పరామర్శించారు. ఆరోగ్యం గురించి వాకబు చేసిన చంద్రబాబు.. అమిత్ షా త్వరలోనే పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, గత నెలలో కరోనా బారినపడిన అమిత్ షా ఆగస్టు 2న గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. 14 రోజుల చికిత్స అనంతరం మళ్లీ పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. దాంతో ఆయన ఆగస్టు 14న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆ తర్వాత శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో ఆగస్టు 18న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. చికిత్స అనంతరం ఆరోగ్యం కుదుటపడడంతో 31న తిరిగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇంటి నుంచే ఆయన విధులు నిర్వహిస్తున్నారు.

    కాగా, అమిత్ షాతో పాటు కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, గజేంద్రసింగ్ షెకావత్, శ్రీపాద నాయక్‌, క్రిషన్‌ పాల్‌ గుర్జర్‌‌ కూడా కరోనా బారినపడ్డారు. వీరిలో ఇప్పటికే పలువురు కోలుకున్నారు. మిగిలిన వారు హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రులను కరోనా వదల్లేదు. గోవా సీఎం ప్రమోద్ సావంత్, కర్నాటక సీఎం యడియూరప్ప, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హరిణాయాన సీఎం మనోహర్‌లాల్ కట్టర్ కరోనా బారినపడ్డారు. యడియూరప్ప, శివరాజ్ సింగ్ ఇప్పటికే కోలుకున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Amit Shah, Andhra Pradesh, AP News, Chandrababu naidu

    తదుపరి వార్తలు