ఆ అరెస్టులు అన్యాయం... తమిళనాడు గోల్డ్ కేసుపై చంద్రబాబు ప్రశ్నాస్త్రాలు...

తమిళనాడు గోల్డ్ కేసులో అన్యాయంగా అరెస్టులు చెయ్యడమే కాక... పోలీసులు భౌతిక దాడులకు పాల్పడ్డారని చంద్రబాబు తన లేఖలో తెలిపారు.

news18-telugu
Updated: July 18, 2020, 8:59 AM IST
ఆ అరెస్టులు అన్యాయం... తమిళనాడు గోల్డ్ కేసుపై చంద్రబాబు ప్రశ్నాస్త్రాలు...
చంద్రబాబు నాయుడు
  • Share this:
అధికార వైపీసీపై రోజుకోరకంగా విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు... తాజాగా... తమిళనాడులో బంగారం పట్టివేత కేసుపై తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై ప్రకాశం జిల్లా... సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కి చంద్రబాబు ప్రత్యేకంగా లేఖ రాశారు. ఈ కేసులో ఒంగోలు పోలీసులు... వాదెళ్ల సందీప్ కుమార్, తొట్టెంపూడి చంద్రశేఖర్‌లను అన్యాయంగా, చట్టవ్యతిరేకంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా అరెస్టు చేశారని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని లేఖలో తెలిపారు. ఫిజికల్‌గా టార్చర్ పెట్టారనీ... వాళ్లిద్దర్నీ అదుపులోకి తీసుకొని 24 గంటలైనా... FIR ఎందుకు రాయలేదని ప్రశ్నించారు.

జులై 14న తమిళనాడులో బంగారం పట్టివేత ఘటనను చంద్రబాబు తన లేఖలో వివరించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్టిక్కర్‌తో ఉన్న కారులో రూ.5.27 కోట్లు దొరికాయని వివరించారు. ఈ డబ్బును తమిళనాడు పోలీసులు పట్టుకున్నారనీ... ఇది ఏపీ సరిహద్దుల నుంచీ వెళ్లినా... ఏపీ పోలీసులు ఎందుకు పట్టుకోలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఒంగోలు రూరల్ పోలీసులు... ఒంగోలుకు చెందిన వాదెళ్ల సందీప్ కుమార్, టంగుటూరు మండలం... నైదుపాలెం గ్రామానికి చెందిన తొట్టెంపూడి చంద్రశేఖ‌ర్‌ను అరెస్టు చేశారన్న చంద్రబాబు... వాళ్లను తమ వెర్షన్ చెప్పుకోనివ్వకుండా... భేతిక దాడులకు దిగారని ఆరోపించారు. వాళ్లిద్దర్నీ వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తిప్పారని మండిపడ్డారు. జులై 16 మధ్యాహ్నం 1 గంటకు అరెస్టు చేస్తే... జులై 17 సాయంత్రం వరకూ FIR ఎందుకు ఫైల్ చెయ్యలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎంక్వైరీ చేసి... బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

చంద్రబాబు రాసిన లేఖ


అంతకుముందు వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ఆంబులెన్స్‌లో గొర్రెల మందలుగా ఎక్కించడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రకమైన చర్యల కారణంగా వైరస్ లేని వారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది 108 పబ్లిసిటీ కోసం చేస్తున్నారా ? లేక మరిన్ని కేసులు ఏపీలో పెంచేందుకు చేస్తున్నారా ? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇక ఏపీని ఆ దేవుడే రక్షించాలి అంటూ టీడీపీ అధినేత ట్వీట్ చేశారు. జిల్లాలో కరోనా అనుమానితులను ఎక్కువ సంఖ్యలో 108 వాహనాలలో తరలిస్తున్న వీడియోను చంద్రబాబు తన ట్వీట్‌కు లింక్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలూ పెరుగుతున్న దశలో... చంద్రబాబు చేసిన ట్వీట్ దుమారం రేపింది.
Published by: Krishna Kumar N
First published: July 18, 2020, 8:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading