మార్చి 1 విడుదల.. విశాఖ రైల్వే జోన్‌పై ప్రకటించనున్న మోదీ?

మార్చి ఒకటో తేదీన విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. రైల్వే జోన్‌ను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: February 26, 2019, 11:01 PM IST
మార్చి 1 విడుదల.. విశాఖ రైల్వే జోన్‌పై ప్రకటించనున్న మోదీ?
ప్రధాని మోదీ (ANI)
  • Share this:
విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కేటాయించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. వాల్తేరు, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు కలిపి విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్‌ను కేటాయించాలని అందులో కోరారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, గత నాలుగున్నరేళ్లుగా రైల్వే జోన్ ఏర్పాటు కాలేదు. వాల్తేరు డివిజన్ ప్రస్తుతం ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉంది. వాల్తేరు డివిజన్‌ను వదులుకోవడానికి ఒడిశా సిద్ధంగా లేదు. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాల్తేరు డివిజన్‌ మీద ఈస్ట్‌కోస్ట్ రైల్వే పట్టుబట్టడంతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ఆలస్యం అవుతోంది. మార్చి ఒకటో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో పర్యటిస్తున్నారు. నగరంలో జరిగే ఓ సభలో పాల్గొంటారు. ఆ రోజు విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటిస్తారంటూ ప్రచారం జరుగుతోంది.

Chandrababu Naidu Visakha Railway Zone, Chandrababu Naidu Piyush Goyal, Visakhapatnam Railway Zone, Visakha Railway Zone, PM Modi Visakha Railway Zone, Piyush Goyal Visakha Railway Zone, PM Modi Visakha Tour, PM Modi Visakha Meeting, చంద్రబాబునాయుడు లేఖ, విశాఖ రైల్వే జోన్ చంద్రబాబునాయుడు, చంద్రబాబునాయుడు విశాఖపట్నం రైల్వే జోన్, ప్రధాని మోదీ విశాఖపట్నం రైల్వే జోన్, పీయూష్ గోయల్ విశాఖపట్నం రైల్వే జోన్
ప్రతీకాత్మక చిత్రం


విశాఖపట్నానికి రైల్వే జోన్ కేటాయించాలంటూ ఇటీవల ఏపీ బీజేపీ నేతలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మరికొందరు నేతలు కలసి పీయూష్‌గోయల్‌కు వినతిపత్రం సమర్పించారు. పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారని బీజేపీ నేతలు చెప్పారు. దీంతో ప్రధాని మంత్రి విశాఖ పర్యటన రోజు రైల్వే జోన్‌ను ప్రకటిస్తారంటూ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు కూడా పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు.

visakha railway zone, tdp mps protest, piyush goyal, railway minister, పియూష్ గోయల్, విశాఖ రైల్వే జోన్, టీడీపీ ఎంపీలు
కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ (ఫైల్ ఫోటో)


ఒడిశాలో బీజేపీ హవా బలంగా వీస్తోందని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లు కూడా దక్కించుకునే రాష్ట్రాల్లో ఒడిశా కూడా ఒకటని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఏపీలో బీజేపీకి బలం లేదు. విశాఖ రైల్వే జోన్‌ను కేటాయించిన వెంటనే పూర్తిగా సీన్ మారిపోయే అవకాశాలు కూడా తక్కువే. 2014 ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ కలసి పోటీ చేశాయి. విశాఖ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన హరిబాబు.. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మపై గెలుపొందారు. దీంతో విశాఖకు రైల్వేజోన్ ఖాయమని ప్రచారం జరిగింది. అయితే, ఇంతవరకు కేటాయించలేదు.

pm modi on surgical strike 2
రాజస్థాన్ చిరులో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ


వాల్తేరు డివిజన్‌ను తీసేసి మిగిలిన విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లను కలిపి విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తారనే ప్రచారం కూడా ఉంది. అయితే, విశాఖకు రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్ర వాసుల కల. ఏపీకి రైల్వేజోన్ అంటే.. అది విశాఖ కేంద్రంగానే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మోదీ ఎలాంటి ప్రకటన చేస్తారని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
First published: February 26, 2019, 10:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading