ఆంధ్రాబ్యాంకు పేరును కొనసాగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు చంద్రబాబు లేఖ...

తెలుగు ప్రజల్లో విశ్వాసాన్ని చురగొన్న ఆంధ్రాబ్యాంకు విశేష సేవలందించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఒకవేళ విలీనం అనివార్యమైతే ఆంధ్రాబ్యాంక్‌ పేరునే కొనసాగించాలని ఆయన కోరారు. అలాగే ఆర్థిక మాంద్యం నేపథ్యంలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు అభినందించారు.

news18-telugu
Updated: September 3, 2019, 10:19 PM IST
ఆంధ్రాబ్యాంకు పేరును కొనసాగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు చంద్రబాబు లేఖ...
చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రాబ్యాంక్‌ విలీనం సమంజసం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న ఆంధ్రబ్యాంకు పేరు పూర్తిగా అంతర్థానమవడం, తెులుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని లేఖలో పేర్కొన్నారు. తెలుగు ప్రజల్లో విశ్వాసాన్ని చురగొన్న ఆంధ్రాబ్యాంకు విశేష సేవలందించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఒకవేళ విలీనం అనివార్యమైతే ఆంధ్రాబ్యాంక్‌ పేరునే కొనసాగించాలని ఆయన కోరారు. అలాగే ఆర్థిక మాంద్యం నేపథ్యంలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు అభినందించారు. సంస్కరణల వల్ల పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

First published: September 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>