విశాఖలో విమానాలకు నో ఎంట్రీ.. నేరుగా అమరావతికి చంద్రబాబు...

ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు విశాఖ పర్యటన రద్దయింది. ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా అమరావతి వెళ్తారు.

news18-telugu
Updated: May 24, 2020, 10:43 PM IST
విశాఖలో విమానాలకు నో ఎంట్రీ.. నేరుగా అమరావతికి చంద్రబాబు...
చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు విశాఖ పర్యటన రద్దయింది. వైజాగ్ ఎయిర్‌పోర్టులో రేపు ఎటువంటి విమానాలు ల్యాండ్ అవడానికి లేదని విమానాశ్రయ అధికారులు చెప్పడంతో పర్యటనలో మార్పులు చేసుకున్నట్టు తెలిసింది. దీంతో చంద్రబాబు, నారా లోకేష్ అమరావతి వెళ్తారు. అమరావతిలోని కరకట్ట మీద ఉన్న తమ నివాసానికి వెళ్లనున్నారు. చంద్రబాబు, నారా లోకేష్‌తో పాటు మరో డ్రైవర్ ఉంటారు. ఈ మేరకు ఏపీ డీజీపీ కార్యాలయం నుంచి అనుమతి వచ్చింది. సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వారు బయలుదేరి వెళ్తారు. వాస్తవానికి హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖ విమానంలో వెళ్లి అక్కడ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించాలని చంద్రబాబు అనుకున్నారు. అనంతరం ఎల్జీ పాలిమర్స్ ఘటన ప్రాంతాన్ని పరిశీలించాలనుకున్నారు. అయితే, విశాఖ ఎయిర్ పోర్టులో విమానాలు దిగే అవకాశం లేదని చెప్పడంతో ఆయన రోడ్డు మార్గంలో అమరావతి వరకు వెళ్లనున్నారు.
First published: May 24, 2020, 10:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading