ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మరో 26 రోజుల్లో వచ్చేస్తాయి. ఫలితాలు వచ్చాక ఏం చెయ్యాలి అని అప్పుడు ఆలోచించే కంటే... ఇప్పటి నుంచే ఏం చెయ్యాలో, ఎలాంటి వ్యూహాలు రచించాలో ఆలోచిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఐతే... ఏం చెయ్యాలన్నా... అసలు టీడీపీకి ఎన్ని ఓట్లు పడ్డాయో, ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలియాలి కదా. అది తెలియాలంటే మే 23 వరకూ ఆగాలి. ఈలోపే తెలుసుకోవాలనుకుంటున్న చంద్రబాబు... టీడీపీకి వాస్తవంగా ఎన్ని ఓట్లు పడ్డాయో వివరాలు రాబట్టేందుకు క్షేత్రస్థాయి నుంచీ నివేదికలు తెప్పిస్తున్నారు. ప్రస్తుతం సిమ్లాలో సేద తీరుతున్న ఆయన.. నాల్రోజుల్లో తిరిగి వచ్చి... ఆ రిపోర్టులను పరిశీలిస్తారని తెలిసింది.
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల స్థాయిలో జరిగిన పోలింగ్ లెక్కలు, అక్కడున్న మొత్తం ఓటర్లు... వాళ్లలో టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేసినవాళ్లు... ఈ వివరాలన్నీ వెంటనే పంపాలని ఆయా నియోజకవర్గాల అభ్యర్థులకు మరోసారి ఆదేశాలిచ్చారు చంద్రబాబు. నిజానికి ఇలాంటి ఆదేశాలు ఇప్పటికే మూడు, నాలుగు సార్లు ఇచ్చారనీ, అయినప్పటికీ జిల్లాల్లో అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపించట్లేదని తెలిసింది. ఏ రిపోర్టులు పంపినా, అంతిమంగా జనం ఎవరికి ఓటు వేసిందీ, కచ్చితంగా తెలిసేది మే 23నే కాబట్టి... ఈ రిపోర్టుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని టీడీపీ అభ్యర్థులు ఆసక్తి చూపట్లేదని సమాచారం.
17 సీ ఫారం లెక్కలపై దృష్టి : సాధారణంగా ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఉన్న మొత్తం ఓటర్లు, పోలైన ఓట్ల వివరాల్ని తెలుసుకునేందుకు ప్రిసైడింగ్ అధికారి... 17సీ ఫారంను పోలింగ్ ఏజెంట్లకు ఇస్తారు. ప్రస్తుతం చంద్రబాబు ఆ ఫారంలను తనకు పంపాలని అభ్యర్థులను కోరుతున్నారు. వాటివల్ల ప్రయోజనం ఏంటంటే... వాటిలో ఎన్ని ఓట్లు పోలయ్యాయో, వీవీప్యాట్ స్లిప్పులు కూడా అన్నే ఉండాలి. లేదంటే ఏదో తేడా జరిగినట్లే. పైగా ఈ ఫారంల వల్ల... పోలైన ఓట్లలో తమకెన్ని పడ్డాయో ఆయా పార్టీలు అంచనా వేసుకునేందుకు వీలవుతుంది. అందుకే చంద్రబాబు ఆ ఫారంల కోసం పదే పదే అడుగుతున్నారని తెలిసింది.
కుప్పం నియోజకవర్గం నుంచీ వివిధ బూత్‌లలో ఎవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయో పూర్తి అంచనాలతో ఓ నివేదిక చంద్రబాబుకు చేరింది. టీడీపీకి కంచుకోటల్లా ఉండే నియోజకవర్గాల నుంచి కూడా నివేదికలు అందాయి. ఐతే కీలకమైన మిగతా నియోజకవర్గాల నుంచీ ఇలాంటి రిపోర్టులు రాకపోవడంపై చంద్రబాబు సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. వారం రోజుల్లో ఆ నివేదికలు అన్నీ తెప్పించుకొని... వాటి ద్వారా టీడీపీకి కచ్చితంగా ఎన్ని ఓట్లు వస్తాయో లెక్కలేస్తారని తెలుస్తోంది. ఒకవేళ మెజార్టీ సీట్లు రావని భావిస్తే, ఏయే పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని అనే అంశంపై వచ్చే వారం చర్చిస్తారని తెలిసింది.
ఇవి కూడా చదవండి :
నేడు హైదరాబాద్‌కి జగన్... పార్టీ నేతలతో కీలక సమావేశం... ఎన్నికల ఫలితాలపై చర్చ
ఉత్తరాంధ్రలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ... ప్రభావం చూపిస్తున్న జనసేన...
ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో అలర్ట్... ఉగ్రవాద దాడులు జరిగే ప్రమాదం...
పవన్ కళ్యాణ్ బాటలో నాగబాబు... జబర్దస్త్ విషయంలో ఏమన్నారంటే...Published by:Krishna Kumar N
First published:April 27, 2019, 07:32 IST