లాక్‌డౌన్‌లో పూర్తిగా మారిన నారా లోకేశ్... టీడీపీ నేతల ఆశ్చర్యం

Nara Lokesh New Look: చంద్రబాబుతో కలిసి లాక్‌డౌన్ సమయంలో హైదరాబాద్‌లో ఉండిపోయిన లోకేశ్... రెండు రోజుల క్రితం ఏపీకి చేరుకున్నారు.

news18-telugu
Updated: May 27, 2020, 6:12 PM IST
లాక్‌డౌన్‌లో పూర్తిగా మారిన నారా లోకేశ్... టీడీపీ నేతల ఆశ్చర్యం
మహానాడుకు వచ్చిన నారా లోకేశ్
  • Share this:
రాజకీయాల్లో అంతగా రాణించలేకపోతున్నాడనే విమర్శలను ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, మాజీమంత్రి నారా లోకేశ్... నాయకుడిగా తనను తాను మలుచుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. నిత్యం నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ఇక తండ్రితో లాక్‌డౌన్ సమయంలో హైదరాబాద్‌లో ఉండిపోయిన లోకేశ్... రెండు రోజుల క్రితం ఏపీకి చేరుకున్నారు. నేడు మహానాడుకు హాజరయ్యారు. అయితే మహానాడు కార్యక్రమంలో ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయారని టాక్ వినిపిస్తోంది. ఇందుకు అసలు కారణంగా నారా లోకేశ్ సన్నబడటమే. గతంలో కాస్త లావుగా కనిపించిన ఆయన.. ప్రస్తుతం స్లిమ్‌గా ప్రత్యక్షమయ్యారు.

లోకేశ్ బరువు తగ్గడంపై మహానాడులో ఆసక్తికర చర్చ జరుగుతోంది. లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఆయన... ఈ సమయాన్ని బరువు తగ్గడానికి ఉపయోగించుకున్నారు. వ్యాయామం, మితఆహారం తీసుకుంటూ భారీగా వెయిట్ తగ్గారు. సుమారు 20 కేజీలు తగ్గినట్టు తెలుస్తోంది. బరువు తగ్గడం ద్వారా తన పట్టుదల ఎలాంటిదో లోకేశ్ నిరూపించుకున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి బరువు తగ్గి టీడీపీ నేతలకు తన కొత్త లుక్ చూపించిన నారా లోకేశ్... రాజకీయాల్లోనూ కొత్తదనం చూపిస్తారేమో చూడాలి.

First published: May 27, 2020, 5:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading