Home /News /andhra-pradesh /

Chandrababu Naidu: సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్న చంద్రబాబు

Chandrababu Naidu: సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్న చంద్రబాబు

చంద్రబాబు

చంద్రబాబు

Chandrababu Naidu: సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ ఉదాసీనతే ప్రజల్లో అభద్రతను పెంచుతూ ఆత్మహత్యలను ప్రేరేపిస్తోందని విమర్శించారు.

    ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ తీరును టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. కోర్టు చివాట్లు పెట్టినప్పుడైనా డీజీపీ మారి ఉంటే సలాం కుటుంబానికి ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. అసలు రాష్ట్రంలో ఏ కుటుంబానికి భద్రత లేదని చంద్రబాబు ఆరోపించారు. తమ ఆస్తులకు భద్రత లేదని ప్రజలు గోడు పెడుతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా సలాం కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులపైన వారిని డిస్మిస్ చేయాలని అయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని అన్నారు.

    సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ ఉదాసీనతే ప్రజల్లో అభద్రతను పెంచుతూ ఆత్మహత్యలను ప్రేరేపిస్తోందని విమర్శించారు. సమాజానికి నమ్మకం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరించలేకపోతే ఇంకా ఈతరహా ఘటనలు ఇంకా పెరిగిపోతాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కేసు పెట్టినట్టు ఉండాలి.. బెయిల్‌ రావాలనే రీతిలో పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు. తెదేపా న్యాయవాది ద్వారానే బెయిల్‌ వచ్చిందంటూ కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు.

    అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, రాజధాని రైతులపై ఎలాంటి కేసులు పెట్టారు? పనికిమాలిన రాజకీయాలు చేస్తూ ఎవరిని మోసం చేస్తున్నారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంత అమానుషం జరిగిన తర్వాత కూడా బుకాయిస్తున్నారని విమర్శించారు. కేసు సక్రమంగా నమోదు చేస్తే విచారణకు ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను పంపాల్సిన అవసరమేంటని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏడాదిన్నరగా ఆటవిక పాలక సాగుతోంది. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Chandrababu naidu, Gautam Sawang

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు