ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మనవడు దేవాన్ష్‌తో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన చంద్రబాబునాయుడు ప్రచార పర్వం ముగిసిన తర్వాత తన మనవడితో కలసి ఆడుకున్నారు. ఈ ఫొటోను నారా లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. తాతామనవళ్లు ఆడుకుంటున్నారంటూ ఫొటోకు క్యాప్షన్ కూడా పెట్టారు. గతంలో కూడా చంద్రబాబునాయుడు తన మనవడితో కూడా ఆడుకోవడానికి సమయం లేదంటూ అప్పుడప్పుడు చెబుతుండే వారు. నారా లోకేష్ కూడా మనవడితో ఆడుకోవాల్సిన సమయంలో చంద్రబాబు ప్రజాజీవితంలో బిజీ అయిపోయారని చెప్పారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఇద్దరూ సరదాగా ఆడుతూ పాడుతూ గడిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chandrababu naidu, Nara Devansh