తిరుపతిలో డిక్సన్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ప్రారంభం

ఎలక్ట్రానిక్స్ తయారీ పేరు చెప్పగానే చైనాలోని షెంజెన్ ఎలా గుర్తుకు వస్తుందో.. భారత్‌లో కూడా ఎలక్ట్రానిక్స్ తయారీ అనగానే తిరుపతిని గుర్తుకు తెచ్చేలా చేస్తామని చంద్రబాబునాయుడు చెప్పారు.

news18-telugu
Updated: October 4, 2018, 6:30 PM IST
తిరుపతిలో డిక్సన్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ప్రారంభం
తిరుపతిలో డిక్సన్ కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతున్న సీఎం చంద్రబాబునాయుడు
news18-telugu
Updated: October 4, 2018, 6:30 PM IST
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ డిక్సన్‌ ఏపీలో ప్రారంభమైంది. తిరుపతిలో డిక్సన్ సంస్థను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి చేతుల మీదుగా ప్రారంభించారు. తొలిదశలో సుమారు రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని వల్ల 800 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. టీవీలు, సీసీ కెమెరాలను తయారుచేయనున్న ఈ కంపెనీ తిరుపతి, రేణిగుంటలోని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్-2 లో ఉత్పత్తి చేయనుంది. షావోమీ, పానాసోనిక్, సాన్యో కంపెనీలకు డిక్సన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఉత్పత్తులను విక్రయిస్తుంది. త్వరలోనే మొబైల్ ఫోన్లు, వాషింగ్ మిషన్లను కూడా తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

చౌడు భూమిలో సిరులు పండించే పరిస్థితికి తెచ్చినందుకు తనకు సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ పేరు చెప్పగానే చైనాలోని షెంజెన్ ఎలా గుర్తుకు వస్తుందో.. భారత్‌లో కూడా ఎలక్ట్రానిక్స్ తయారీ అనగానే తిరుపతిని గుర్తుకు తెచ్చేలా చేస్తామని చెప్పారు. దీన్ని సాధించి చూపిస్తామని స్పష్టం చేశారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురంలో భారీగా భూమి అందుబాటులో ఉందని, పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు చెప్పారు.

ప్రతిభ కలిగిన యువతీ యువకులు కూడా రాష్ట్రంలో ఉన్నారని.. అందువల్ల డిక్సన్ కంపెనీకి ఎలాంటి మానవ వనరుల కొరత ఉండబోదన్నారు. డిక్సన్ కంపెనీ రాబోయే రోజుల్లో మరో 1500 మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. తిరుపతిని ఎలక్ట్రానిక్స్ రంగంలోనే కాకుండా టూరిజం పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు.

డిక్సన్ కంపెనీని ప్రారంభించిన అనంతరం చంద్రబాబు.. ఆ కంపెనీని పరిశీలించారు. ఉద్యోగులతో మాట్లాడారు. ఉత్పత్తి గురించి అడిగి తెలుసుకున్నారు.

First published: October 4, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...