Home /News /andhra-pradesh /

CHANDRABABU NAIDU DEMANDS FOR CANCELLATION OF SSC EXAMS IN AP SK

పదో తరగతి పరీక్షలు రద్దు చేయాల్సిందే.. చంద్రబాబు డిమాండ్

వైసీపీ ప్రభుత్వ ఉదాసీనత వల్ల ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. పది రోజులకే రాష్ట్రంలో లక్ష కరోనా కేసులు నమోదయ్యాయని ఆయన పార్టీ సీనియర్ నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యానించారు.

వైసీపీ ప్రభుత్వ ఉదాసీనత వల్ల ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. పది రోజులకే రాష్ట్రంలో లక్ష కరోనా కేసులు నమోదయ్యాయని ఆయన పార్టీ సీనియర్ నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యానించారు.

పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

    కరోనా నేపథ్యంలో పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయని.. ఏపీలోనూ పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. కరోనా కష్టాల్లో SSC పరీక్షలు నిర్వహించడం తుగ్లక్ చర్యన్న ఆయన.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని సీఎం జగన్‌పై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి ఏమీ తెలియదని.. చెబినా వినడరని, వారికి తోచిందే చేస్తారని దుయ్యబట్టారు చంద్రబాబు. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల జీవితాలతో ఆడుకున్నారని.. ఇప్పుడ వారి కన్ను టెన్త్ విద్యార్థులపై పడిందని తీవ్ర విమర్శలు గుప్పించారు.

    రోజురోజుకూ కరోనా ఉధృతం అవుతున్న తరుణంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ అవివేకం. ఇప్పటికే అన్నివర్గాల ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. ఇప్పుడిక విద్యార్ధులపై మీ కన్ను పడింది. మీ తుగ్లక్ చర్యలకు విద్యార్ధుల ఆరోగ్యాన్ని బలిపెట్టవద్దు. అనేక రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ క్షేమదాయకం కాదు. మన రాష్ట్రంలో కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలి.
    చంద్రబాబు నాయుడు


    సీఎం జగన్ నిర్లక్ష్యం వల్లే కరోనా అన్ని జిల్లాలలో విజృంభిస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు. మొదట్లో పారాసిటమాల్, బ్లీచింగ్ చాలని తేలిగ్గా వ్యాఖ్యలు చేశారని. వైసీపీ వాళ్లు కరోనాను చాలా తేలిగ్గా తీసుకున్నారని విమర్శించారు. ట్రాక్టర్ల ర్యాలీలు, పూలు జల్లించుకోడాలు, సంబరాలు-ఉత్సవాల్లో మునిగి, కరోనా కట్టడిలో విఫలం పూర్తిగా విఫలమయ్యారని చంద్రబాబు మండిపడ్డారు. అనేక తిక్క చేష్టలతో రాష్ట్ర భవిష్యత్‌ను దెబ్బతీశారని.. ఇప్పుడీ అనాలోచిత నిర్ణయంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని కరోనాకు బలి పెడతారా? అని ప్రశ్నించారు. కాగా, పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.


    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chandrababu naidu, Ssc exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు