వారి ఆకాంక్షలను గుర్తించండి... చంద్రబాబు డిమాండ్

రాష్ట్ర రాజధాని కోసం ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష కొనసాగిస్తున్న ఉద్యమకారులను సమాజం గుర్తించాలని చంద్రబాబు కోరారు.

news18-telugu
Updated: March 26, 2020, 3:58 PM IST
వారి ఆకాంక్షలను గుర్తించండి... చంద్రబాబు డిమాండ్
చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
రాజధానిగా అమరావతే కొనసాగాలని రైతుల ఆకాంక్ష ఎంత బలంగా ఉందో గ్రహించి మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని అమరావతి పరిరక్షణ ఉద్యమం వందో రోజుకు చేరడంపై చంద్రబాబు స్పందించారు. వంద రోజులుగా అడుగడుగునా నిర్బంధాలు, పోలీసు కేసులు, వేధింపులు, అవమానాల నడుమ అమరావతి రైతుల ఆందోళన కొనసాగిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ అమరావతి రైతులు ఆందోళన కొనసాగుతూనే ఉందని చంద్రబాబు అన్నారు.

రైతులు, మహిళలు, రైతు కూలీలు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉద్యమం కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, మిలిటరీ వాళ్లు దేశం కోసం అండగా నిలిచినట్టుగానే.. రాష్ట్ర రాజధాని కోసం ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష కొనసాగిస్తున్న ఉద్యమకారులను సమాజం గుర్తించాలని చంద్రబాబు కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో స్పందించి మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.


First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading