విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మరోసారి స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఏదో దాస్తోందని అన్నారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటన బాధితులను పరామర్శించేందుకు ఆర్ ఆర్ వెంకటాపురం వెళ్తున్న టీడీపీ నేత బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. విశాఖలో పరిస్థితి మొత్తం చక్కబడితే, టీడీపీ నేతలను ఎందుకు అనుమతించడం లేదని చంద్రబాబు ప్రశ్నినంచారు. ‘నాకు చాలా విశ్వసనీయమైన సమాచారం ఉంది. గ్యాస్ లీక్ ఘటన, దాని తదనంతర సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గ్యాస్ లీక్ ఘటన తర్వాత బాధితులకు సాయం చేసిన ఓ హైర్యాంక్ పోలీస్ అధికారి ఆస్పత్రి పాలైనట్టు ప్రజలు చెబుతున్నారు. మంత్రులు ఫొటోలు దిగొచ్చు. కానీ, టీడీపీ నేతలను మాత్రం ఎందుకు అనుమతించరు? బాధితులను ఎందుకు కలవనివ్వడం లేదు? ప్రభుత్వం ఏం దాస్తోంది? జగన్ ఎందుకు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు?’ అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.
Vizag TDP’s Bandaru Satyanarayana & other leaders were arrested by the police when they made efforts to visit RR Venkatapuram which was affected by the #VizagGasLeak. If everything has come back to normalcy, why are members of the opposition not allowed into the area? (1/3) pic.twitter.com/DtIQ7ly3pL
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) May 14, 2020
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.