హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan Birthday: వైఎస్ జగన్ కు చంద్రబాబు బర్త్ డే విషెస్.. ఏమని ట్వీట్ చేశారంటే..!

YS Jagan Birthday: వైఎస్ జగన్ కు చంద్రబాబు బర్త్ డే విషెస్.. ఏమని ట్వీట్ చేశారంటే..!

చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్

చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan) కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ (PM Narendra Modi), టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra babu naidu)తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం నుంచి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం జగన్‌కు బర్త్‌ డే విషెస్‌ తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించిన ఆయన.. ‘వైఎస్‌ జగన్‌ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’. అని ట్వీట్‌ చేశారు. రాజకీయపరంగా సీఎం జగన్, చంద్రబాబు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా.. పుట్టినరోజులు వచ్చినప్పుడు మాత్రం శుభాకాకంక్షలు తెలుపుకుంటారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా సీఎం జగన్ కూడా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

అలాగే ముఖ్యమంత్రికి ప్రముఖులు జన్మదిన శుభాకాకంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా జగన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.

లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ట్విట్టర్ ద్వారా జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ రాజ్యసభ ఎంపీలు విజయసాయి రెడ్డి, పరిమళ్ నత్వాని బర్త్ డే విషెష్ ను ట్వీట్టర్ ద్వారా తెలిపారు. యంగ్ అండ్ డైనమిక్ సీఎం వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొన్న నత్వానీ.. మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వెంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

ఇక తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు కూడా జగన్ కు పుట్టినరోజు శుభాకాంభలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రజాసేవలో సుదీర్ఘకాలం కొనసాగాలి అన్నా అని కేటీఆర్ పేర్కొన్నారు. తమిళనాడు సీఎం పళనిస్వామి కూడా జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు.

సినీప్రముఖులు కూడా సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు జగన్ కు విషెస్ చెప్తూ ట్వీట్లు చేశారు.

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసింది.

First published:

Tags: Ap cm ys jagan mohan reddy, Chandrababu naidu, Chiranjeevi, Lok Sabha Speaker Om Birla, Mahesh babu, Megastar Chiranjeevi, Nitin Gadkari, Parimal Nathwani, PM Narendra Modi, Twitter, Vijayasai reddy, Ysrcp

ఉత్తమ కథలు