Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    ఎన్టీఆర్ నిషేధిస్తే.. రెట్టింపు ఘనత చంద్రబాబుదన్న జీవీఎల్

    రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.5  నుంచి రూ.6 వేల కోట్ల ఆదాయం మద్యం విక్రయాలు ద్వారా వస్తోందని, ప్రభుత్వానికి ఆదాయం పోతోందని మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరడం వల్ల కేంద్ర ప్రభుత్వం అయిష్టతతోనే సడలింపు ఇచ్చిందని జీవిఎల్ పేర్కొన్నారు.

    news18-telugu
    Updated: May 6, 2020, 6:53 PM IST
    ఎన్టీఆర్ నిషేధిస్తే.. రెట్టింపు ఘనత చంద్రబాబుదన్న జీవీఎల్
    జీవీఎల్ నరసింహారావు(ఫైల్ ఫోటో)
    • Share this:
    నాటి సీఎం ఎన్టీఆర్ మద్యపాన నిషేధం అమలు చేస్తే.. మద్యం విక్రయాలను పెంచి ఆదాయం రెట్టింపు చేసిన ఘనత చంద్రబాబునాయుడిదని, మద్యం విక్రయాల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. మద్యం అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాధికారం రాష్ట్రాలకు ఇస్తూ నిబంధనలతో కూడిన సడలింపులు మాత్రమే ఇచ్చిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. 75శాతం పైగా మద్యం ధరలు పెంచడం కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమేనని, మద్యం విక్రయాల విషయంలో, ఆదాయం విషయంలో  రాష్ట్ర ప్రభుత్వాలదే అంతిమ నిర్ణయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికార వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు మద్యం విక్రయాలు కేంద్రం ఆదేశాలతో చేస్తున్నామని అనడాన్ని జీవిఎల్ తప్పుపట్టారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనమని విమర్శించారు.

    రెండు రోజుల క్రితం మద్యం అమ్మకాలు కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభించారని, కేంద్రం ఆదేశాలతో మద్యం విక్రయాలు చేస్తే కేరళలో, తమిళనాడులో ఎందుకు ప్రారంభం కాలేదని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అయిష్టతతోనే సడలింపులతో కూడిన నిర్ణయాధికారం ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.5  నుంచి రూ.6 వేల కోట్ల ఆదాయం మద్యం విక్రయాలు ద్వారా వస్తోందని, ప్రభుత్వానికి ఆదాయం పోతోందని మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరడం వల్ల కేంద్ర ప్రభుత్వం అయిష్టతతోనే సడలింపు ఇచ్చిందని జీవిఎల్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలది రాజకీయ అవకాశవాదమేనని, ప్రజల ప్రయోజనాలపై దృష్టి లేదని విమర్శించారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి కారణంగా మద్యం విక్రయాలపై సడలింపులు ఇచ్చిందే తప్ప మద్యం విక్రయాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్లే జరుగుతున్నాయని చెప్పారు.

    రాష్ట్ర ప్రభుత్వం ఉదయం నుంచి సాయంత్రం వరకు మద్యం విక్రయాలు ఆదాయం కోసం మాత్రమే చేస్తోందని అన్నారు. మద్యం విక్రయంతో వచ్చే డబ్బంతా రాష్ట్ర ఖజానాలోకే వెళ్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ పేరుతో రూ.1.7 లక్షల కోట్ల నిధులు, కరోనా నియంత్రణ కోసం మరో రూ.30 వేల కోట్లు రాష్ట్రాలకు ఇచ్చి ఆపద సమయంలో అండగా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో మద్యం విక్రయాలు చేస్తోందని ఎద్దేవా చేశారు.
    Published by: Narsimha Badhini
    First published: May 6, 2020, 6:53 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading