Home /News /andhra-pradesh /

CHAIYANYA GODAVARI BANK PROVIDING LOANS FOR JAGANANNA SASVATHA GRUHA HAKKU BENEFICIARIES CM YS JAGAN LAUNCHED THE SCHEME FULL DETAILS HERE PRN

OTS Scheme in AP: ఓటీఎస్ స్కీమ్ లబ్ధిదారులకు బంపర్ ఆఫర్.. సర్కారీ ఇళ్లపై బ్యాంక్ లోన్లు..

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటీఎస్ విధానం (OTS Scheme)పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. 1983 నుంచి 2011 మధ్య ప్రభుత్వం వద్ద రుణం తీసుకొని ఇళ్లు నిర్మించుకున్నవారికి శాశ్వత హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఓటీఎస్ పథకాన్ని అమలు చేస్తోంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటీఎస్ విధానం (OTS Scheme)పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. 1983 నుంచి 2011 మధ్య ప్రభుత్వం వద్ద రుణం తీసుకొని ఇళ్లు నిర్మించుకున్నవారికి శాశ్వత హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఓటీఎస్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.20వేల చొప్పున లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తోంది. తాజాగా ఓటీఎస్ విధానంలో ఇళ్లపై హక్కులు పొందిన వారికి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓటీఎస్‌ లబ్ధిదారులకు మరింత మేలు చేకూర్చే విధంగా ఇళ్లపై భారీగా రుణ సదుపాయం కల్పిస్తోంది. ఒక్కో ఇంటిపై గరిష్టంగా రూ.3 లక్షల వరకూ రుణం ఇచ్చుందుకు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు (Chaitanya Godavari Bank) ముందుకు వచ్చింది.

    ఓటీఎస్‌ పథకం ద్వారా క్లియర్‌ టైటిల్స్‌ పొందిన వారికి బ్యాంకులు భారీగా రుణ సదుపాయాన్ని కల్పించడం ప్రారంభించాయి. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్‌ చేతులమీదుగా గుంటూరు కార్పొరేషన్‌కు చెందిన లబ్ధిదారులు చెక్కులు అందుకున్నారు. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు వీరికి రుణాలు మంజూరుచేసింది. కనిష్టంగా రూ.1.5లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఓటీఎస్‌ లబ్ధిదారులకు ఈ బ్యాంకు రుణాలు ఇస్తోంది.

    ఇది చదవండి: 'నా తండ్రి పేరు కోసం ఎవర్నీ అడగను..' వంగవీటి రంగా జిల్లాపై రాధా కీలక వ్యాఖ్యలు..!


    గుంటూరు కార్పొరేషన్‌కు చెందిన లబ్ధిదారులు కేవలం రూ.20వేలు ఓటీఎస్‌ కింద చెల్లించి క్లియర్‌ టైటిల్స్‌ పొందారని.., ఎలాంటి న్యాయవివాదాలు లేకుండా వారి చేతికి రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందాయని సీఎం తెలిపారు. దీని ద్వారా పొందిన ఆస్తిని బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందే అవకాశాన్ని కల్పించామన్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంవల్ల జరుగుతున్న మంచికి ఇది చక్కటి ఉదాహరణ అని సీఎం తెలిపారు. బ్యాంకులు ఉత్సాహంగా ముందుకు వచ్చి ఓటీఎస్‌ లబ్ధిదారులకు రుణాలు ఇవ్వడం సంతోషకరమన్నారు.

    ఇది చదవండి: మంచు కుటుంబం పేదవాళ్లంట..! ఏడు కోట్ల ల్యాండ్ చుట్టూ వివాదం..


    రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, స్టాంప్‌డ్యూటీలను పూర్తిగా మినహాయించడం వల్ల వీరిలో ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున మేలు కలిగినట్లు తెలిపారు. ఓటీఎస్‌ పథకం ద్వారా దాదాపు రూ.10వేల కోట్ల రుణం మాఫీ అవ్వడమే కాకుండా, దాదాపు మరో రూ.1600 కోట్ల రూపాయలు స్టాంపు డ్యూటీ మినహాయింపుల ద్వారా మరింత మేలు జరిగిందన్నారు. పేదవాడి జీవితాల్లో గొప్ప మార్పులకు శ్రీకారం చుడుతున్నామని.., వారి కాళ్లమీద వాళ్లు నిలబడడానికి ఇవి దోహదం చేస్తాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో చైతన్య గోదావరి బ్యాంక్ ఛైర్మన్ టి.కామేశ్వరరావు, ఎల్ఎల్బీసీ కన్వీనర్ బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap government

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు