ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధింపు ?

పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధింపు ద్వారా రూ. 600 కోట్లు వస్తాయని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.

news18-telugu
Updated: September 17, 2020, 2:32 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధింపు ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో వివిధ కార్యక్రమాలకు నిధులు సమీకరించే ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 1 మేరకు సెస్ విధించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు కూడా పూర్తి చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధింపు ద్వారా రూ. 600 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రోడ్ల నిర్మాణం కోసం వెచ్చించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా వచ్చే అదనపు ఆదాయాన్నరాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కేటాయించాలని ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు గురువారం పెట్రోల్, డీజిల్ ధరలను 13-20 పైసలు తగ్గించాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం ఢిల్లీలో, పెట్రోల్ ధర లీటరుకు. 81.55 నుండి 81.40 రూపాయలకు, డీజిల్ లీటరుకు 72.56 రూపాయల నుండి 72.37కు దిగి వచ్చింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.84.60, డీజిల్ ధర 78.88 రూపాయలు ఉండగా..అమరావతిలో పెట్రోల్ ధర రూ.86.18, డీజిల్ 80.07 రూపాయలుగా ఉంది.
Published by: Kishore Akkaladevi
First published: September 17, 2020, 2:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading