పోలవరంపై ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్

గత ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 5600 కోట్లకు సంబంధించిన బిల్లులపై పరిశీలన అనంతరం డిపిఆర్-1 మేరకు పెండింగ్ బిల్లులో కొంత మేర క్లియర్ చేయాలని కేంద్రం నిర్ణయించింది.

news18-telugu
Updated: November 8, 2019, 4:41 PM IST
పోలవరంపై ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్
పోలవరం ప్రాజెక్టు
  • Share this:
పోలవరం ప్రాజెక్టు అంశంలో ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ అందించింది. ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లులో 1850 కోట్లు విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న రూ. 5600 కోట్ల బకాయిలకు గాను రూ. 1850 కోట్లకు కేంద్రం విడుదల చేయనుంది. మిగిలిన వాటిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరాలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. సవరించిన అంచనాలపై తుది నిర్ణయం తరువాతే మిగతా బిల్లులు క్లియర్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. గత ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 5600 కోట్లకు సంబంధించిన బిల్లులపై పరిశీలన అనంతరం డిపిఆర్-1 మేరకు పెండింగ్ బిల్లులో కొంత మేర క్లియర్ చేయాలని కేంద్రం నిర్ణయించింది.

పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన ఏపీ ప్రభుత్వం... ఈ ప్రాజెక్టు నిర్మాణం అంశంలో రూ. 800 కోట్లకు పైగా ఆదా జరిగిందని ఏపీ ప్రభుత్వం చెప్పుకుంటున్న విషయం తెలిసిందే.


First published: November 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>