ఏపీలో రాజకీయ సంక్షోభం... టార్గెట్ చంద్రబాబు ? రాష్ట్రపతి పాలన తెస్తారా ?

AP Assembly Election : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాక రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పరిస్థితి సీఎస్ వర్సెస్ చంద్రబాబు అయిపోయింది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 4, 2019, 7:21 AM IST
ఏపీలో రాజకీయ సంక్షోభం... టార్గెట్ చంద్రబాబు ? రాష్ట్రపతి పాలన తెస్తారా ?
చంద్రబాబు నాయుడు
  • Share this:
ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే... రాష్ట్ర పాలన ఎవరి చేతుల్లో ఉంటుంది నేతల చేతుల్లోనా... అధికారుల చేతుల్లోనా... ఇదే అంశంపై ఇటు టీడీపీ నేతలు, అటు చీఫ్ సెక్రెటరీ (సీఎస్) ఎవరికి వారు తమ మాటే చెల్లుతుంది అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ సైలెంట్‌గా ఉండగా... మాటల యుద్ధం సీఎస్, టీడీపీ చీఫ్ చంద్రబాబు మధ్య సాగుతోంది. రాజ్యాంగ నిపుణులైతే... ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా... సీఎంకి రాష్ట్రాన్ని పాలించే అధికారం ఉంటుందని అంటున్నారు. అది అధికారం కిందకు రాదనీ, బాధ్యత కిందకు వస్తుందని వివరిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు రావడానికి ఎక్కువ కాలం పడుతుంది కాబట్టి... సీఎంకి పరిపాలనా బాధ్యతలు ఉంటాయంటున్నారు. ఇదే విషయాన్ని లేవనెత్తుతూ చంద్రబాబు... తనకు సమీక్షలు చేసే అధికారం ఎందుకు లేదంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీనిపై స్పందించని ఈసీ... కనీసం తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ని సడలించమని కోరితే... అందుకు అంగీకరిస్తూ... 4 జిల్లాల్ని కోడ్ నుంచీ మినహాయించింది. కానీ... దీనిపైనా చంద్రబాబు మండిపడ్డారు. తుఫాను వెళ్లిపోయాక, మినహాయింపు ఇచ్చి ఏం లాభం అంటున్నారు.

president rule, ap assembly election, ap assembly elections, ap assembly election 2019, ap assembly elections 2019, lok sabha election, lok sabha elections, lok sabha election 2019, lok sabha elections 2019, chandrababu, tdp, jagan, ycp, pawankalyan, janasena, l v subrahmanyam, poll results, survey, ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు, చంద్రబాబు, టీడీపీ, వైఎస్ జగన్, వైసీపీ, పవన్ కళ్యాణ్, జనసేన, ఎన్నికల ఫలితాలు, సర్వే, ఫలితాలు, రాష్ట్రపతిపాలన,
ఎల్ వీ సుబ్రహ్మణ్యం


జనరల్‌గా రాష్ట్రాన్ని పాలించేది సీఎం అయితే, అధికార యంత్రాంగం ద్వారా రాష్ట్ర పాలన అమలయ్యేలా చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)పై ఉంటుంది. ఇప్పుడీ రెండు వ్యవస్థలకూ ఏపీలో అస్సలు పడట్లేదు. సమస్యేంటంటే... రాష్ట్రంలో వైసీపీతో జట్టుకట్టిన బీజేపీ... తమను టార్గెట్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా కుట్రలు పన్నుతోందని చంద్రబాబు అండ్ కో ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు సీఎంకి అధికారాలు ఉండవని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు టీడీపీలో తీవ్ర కలకలం రేపాయి. కేంద్రంలో బీజేపీ... రాష్ట్రంలో అనధికారిక రాష్ట్రపతి పాలన విధిస్తోందని మండిపడుతున్నారు టీడీపీ నేతలు.


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పునేఠను బదిలీ చెయ్యడంతోనే వివాదం మొదలైంది. పునేఠ స్థానంలో వచ్చిన ఎల్వీ సుబ్రహ్మణ్యం తమకు ఏమాత్రం సహకరించట్లేదన్నది టీడీపీ వాదన. ఇదే సమయంలో... సీఎం చంద్రబాబు అధికారాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందనీ, ఆయన్ని సెక్రటేరియట్‌కి దూరంగా ఉంచాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్... రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. అదే సమయంలో వైసీపీ నేతలు... కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఇదే వాదన వినిపించారు.



ప్రస్తుతం సీఎస్ స్వయంగా సమీక్షలు జరుపుతున్నారు. పైగా సీఎం సమావేశాలకు ఆయన హాజరుకావట్లేదు. దీనిపై మండిపడుతున్న చంద్రబాబు... చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 8 వరకూ (ఐదేళ్ల కాలం) ఏపీకి తానే సీఎంగా ఉంటాననీ, నెక్ట్స్ సీఎం ఎవరన్నది ఫలితాలతో తేలుతుందని అన్నారు. సీఎస్ మాత్రం కొత్త ప్రభుత్వం మే 24 నుంచీ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ జగన్ సీఎం అయితే... ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయదలిస్తే, అప్పుడే కొత్త సీఎం పాలన మొదలవుతుందని అన్నారు.

జగన్‌పై ఉన్న కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యానికి సీఎస్ బాధ్యతలు ఎలా ఇస్తారన్నది టీడీపీ వేస్తున్న ప్రశ్న. దీని వెనక వైసీపీ కుట్ర ఉందంటున్నారు చంద్రబాబు. ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా 19 రోజుల టైం ఉంది. కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని సీఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ మాత్రం తామే అధికారంలోకి వస్తామనీ, అప్పుడు తడాఖా చూపిస్తామనీ అంటోంది.
ఈ పరిస్థితులను గమనిస్తున్న కేంద్రం ఏ క్షణమైనా రాష్ట్రపతి పాలన అమలు చేసేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలప్పుడు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులూ తలెత్త కూడదంటే రాష్ట్రపతి పాలన ఒక్కటే సరైన మార్గమని కేంద్ర వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీని అణచివేసే కుట్రలో భాగంగానే ఇలాంటి వ్యూహాలు రచిస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు ఒప్పుకునేది లేదని తెగేసి చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి :

మరింత పెరగబోతున్న ఎండల వేడి... ఫొణి తుఫాను ప్రభావమే...

కరెంటు షాక్ కొట్టిన కూలర్... ఆరేళ్ల చిన్నారి మృతి

చంద్రబాబు దృష్టి ఫలితాలపై... 4 నుంచీ ఓట్ల లెక్కింపు... సీట్ల సంఖ్య తేలుతుందా...
First published: May 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు