ఏపీలో కాపుల రిజర్వేషన్ బిల్లుపై(Kapu Reservation Bill) కేంద్రం కీలక ప్రకటన చేసింది. కాపులకు గత ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ చెల్లుతుందని పేర్కొంది. ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషణ్ల కల్పనకు మా అనుమతి అవసరం లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రానికి అధికారం ఉందని వెల్లడించింది. ఓబీసీ రిజర్వేషన్ల (OBC Reservation) అంశం రాష్ట్ర జాబితాకు సంబంధించినదని పేర్కొంది. 2019లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ (AP Assembly) చేసిన చట్టం చట్టబద్ధమైనదే అని స్పష్టం చేసింది. రాష్ట్ర జాబితాలో ఉన్న కాపు రిజర్వేషన్ల కల్పనలో మాత పాత్ర లేదని వివరించింది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలుఓబీసీ వర్గాలకు గరిష్టంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చని.. 2021లో చేసిన 15వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంత జాబితా తయారు చేసుకోవచ్చని పేర్కొంది.
కొన్నినెలల క్రితం కాపు రిజర్వేషన్ అంశాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పార్లమెంట్ లో లేవనెత్తారు. రాజ్యసభ జీరో అవర్లో మాట్లాడిన జీవీఎల్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపులకు ఓబీసీ రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో కాపులు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డారని.. కావున వారికి రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ జనాభాలో 18శాతం ఉన్న కాపులకు అభివృద్ధి ఫలాలు అందడం లేదని.. రాష్ట్ర అభివృద్ధిలో కాపులు విశేషంగా కృషి చేశారని ఆయన అన్నారు.
బ్రిటిష్ పాలనలో, కాపులను వెనుకబడిన తరగతులుగా పరిగణించారు (1915 జిఓ నెం.67 ప్రకారం) కానీ 1956లో నీలం సంజీవ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ జాబితా నుండి వారిని తొలగించారన్నారు. 1956 నుంచి రాజకీయంగా అధికారం లేదన్న కారణంగా అన్ని ప్రభుత్వాలు కాపులకు అన్యాయం చేశాయని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. విద్యాపరంగా, సామాజికంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న కాపులు రిజర్వేషన్ల కోసం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని.. ముఖ్యంగా గత రెండు దశాబ్దాలుగా ఏపీలో కాపు రిజర్వేషన్ల కోసం రాజకీయ ఆందోళనలు చేస్తూనే వున్నారన్నారు. 2017లో విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కాపులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కాపు రిజర్వేషన్ బిల్లు-2017 పేరుతో ఏపీ అసెంబ్లీ బిల్లును ఆమోదించిందని జీవీఎల్ గుర్తుచేశారు.
రాష్ట్రంలో విద్య , ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నప్పటికీ, బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపారని.. ఇది అనవసరమని.., రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తనంతట తానుగా చర్య తీసుకోవచ్చని జీవీఎల్ సూచించారు. ముస్లిం రిజర్వేషన్ బిల్లును సమ్మతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపలేదని.., కాపుల బిల్లును మాత్రమే పంపారని.. ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వంపై మోపాలన్నదే దాని ఉద్దేశమని జీవీఎల్ ఆరోపించారు.
CM Jagan Birthday: కెప్టెన్ గా అరుదైన ఘనత సొంతం.. సీఎం జగన్ గురించి ఈ విషయం మీకు తెలుసా?
CM Jagan Birthday: సీఎం జగన్ కు ప్రధాని సహా ప్రముఖుల శుభాకాంక్షలు.. చంద్రబాబు .. పవన్..?
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈబీసీ కోటాలోని ఐదు శాతాన్ని కాపులకు ఇస్తున్నట్లు చంద్రబాబు హయాంలోని టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ అంశం తెరమరుగైంది. కాపులకు రిజర్వేషన్ సాధ్యం కాదని.. అందుకు బదులుగా ఏడాదికి రెండు వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో పదివేల కోట్లు ఖర్చు చేస్తామని పాదయాత్ర సందర్భంగా ప్రస్తుత సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆ తర్వాత ఏపీలో కాపు రిజర్వేషన్ ఉద్యమం పెద్దగా ముందుకెళ్లలేదు. తాజాగా బీజేపీ ఎంపీ ఏకంగా పార్లెమంటులో ఈ విషయాన్ని లేవనెత్తడం చర్చనీయాంశమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kapu Reservation