జగన్‌కు కేంద్రం మరో గుడ్ న్యూస్.. కీలక అధికారి పదవీకాలం పొడిగింపు

ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం పొడిగింపు విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: August 7, 2020, 9:11 PM IST
జగన్‌కు కేంద్రం మరో గుడ్ న్యూస్.. కీలక అధికారి పదవీకాలం పొడిగింపు
సీఎం జగన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం పొడిగింపు విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆమె పదవీకాలాన్ని మరో మూడు నెలల పొడగించాలని ఏపీ సీఎం జగన్ చేసిన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం మరో మూడు నెలలు పొడిగించాలని కోరుతూ సీఎం జగన్ కొద్దిరోజుల క్రితం కేంద్రానికి లేఖ రాశారు. నీలం సాహ్ని పదవీకాలం జూన్ 30 నాటికి ముగిసింది. ఆమె పదవీకాలాన్ని ఆరునెలలు పొడిగించాలని సీఎం జగన్ గతంలో ఓ సారి కేంద్రాన్ని కోరారు. అప్పట్లో కేంద్రం నీలం సాహ్ని పదవీకాలానికి మూడు నెలల పొడిగింపు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం ప్రకారం సెప్టెంబర్ 30 తో నీలం సాహ్ని పదవీకాలం ముగియాల్సి ఉండగా... తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో డిసెంబర్ 31 వరకు ఏపీ సీఎస్‌గా ఆమె కొనసాగనున్నారు.

AP New districts, committee on ap new district, Andhra Pradesh, Neelam Saahni, ఏపీ కొత్త జిల్లాలు, ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీ, నీలం సాహ్ని, ఏపీ న్యూస్
ఏపీ సీఎస్ నీలం సాహ్ని(ఫైల్ ఫోటో)


మరోవైపు కేంద్రం నుంచి సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం పెంపుపై సానుకూల సంకేతాలు వచ్చిన తరువాతే ఆమె నేతృత్వంలో జగన్ సర్కార్ ఏపీ జిల్లాల పునర్విభజన కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. జిల్లాల పునర్విభజనపై కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఇందులో సీసీఎల్ఏ కమిషనర్, జీఏడీ కార్యదర్శి, ప్రణాళికశాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి, ప్రిన్సిపల్ ఫైన్సాన్స్ సెక్రటరీ సభ్యలుగా కొనసాగుతారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు వనరులు, తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ అధ్యయనం చేయనుంది. దీంతో పాటు జిల్లాల సరిహద్దులు, జిల్లాలో వనరుల సమతూకం సహా ఇతర అంశాలపై కమిటీ చర్చించనుంది. ఈ కమిటీ మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీన్ని బట్టి నీలం సాహ్ని పదవీకాలం పూర్తయ్యేలోపే కొత్త జిల్లాలపై ఆమె నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇవ్వనుందని అర్థమవుతోంది.
Published by: Kishore Akkaladevi
First published: August 7, 2020, 9:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading