Home /News /andhra-pradesh /

CENTRE CUTS EXCISE DUTY ON PETROL AND DIESEL BY RS 8 AND RS 6 PER LITRE ANDHRAPRADESH AND TELANGANA PETROL AND DIESEL PRICES REDUCE PVN

Oil Prices : భారీగా తగ్గిన ఆయిల్ ధరలు..ఏపీ,తెలంగాణలో రేపటి నుంచి లీటర్ పెట్రోల్,డీజిల్ ఎంతంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Oil Prices In AP : కొద్ది రోజులుగా భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఉపశమనం కలిగించేలా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం(Central Excise Duty)తగ్గిస్తున్నట్లు  శనివారం కేంద్రం ప్రకటించింది.

ఇంకా చదవండి ...
Oil Prices In AP : కొద్ది రోజులుగా భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఉపశమనం కలిగించేలా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం(Central Excise Duty)తగ్గిస్తున్నట్లు  శనివారం కేంద్రం ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం శనివారం(మే 21) పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ సుంకాన్ని తగ్గించడం ద్వారా వాహనదారులకు భారీ ఊరట లభించింది. దీంతో లీటరు పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గుతుందని ఆమె తెలిపారు. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి ప్రతిఏటా దాదాపు రూ.1 లక్ష కోట్ల వరకు ఆదాయం తగ్గిపోనుంది.

అయితే కేంద్రం తాజా ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో అత్యధికంగా ఇవాళ లీటర్ పెట్రోల్ ధర రూ.122.39 పైసలు గా ఉండగా,అత్యల్పంగా విశాఖలో రూ. 120 ఉంది. అయితే రేపటి నుంచి ఈ ధరలు తగ్గనున్నాయి. పెట్రోల పై దాదాపు రూ. 10 తగ్గనుంది. అంటే రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో లీటరు పెట్రోల్ రూ.110కే లభించనుంది. లీటర్ డీజిల్ రేపటి నుంచి రూ.98కే ఆంధ్రప్రదేశ్ లో లభించనుంది.

ఇక,ఇవాళ తెలంగాణలో(హైదరాబాద్) లీటరు పెట్రోల్ ధర రూ.119.49గా,లీటరు డీజిల్ ధర రూ. 105.49గా ఉంది. తగ్గిన ధరలతో..రేపటి నుంచి హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ రూ. 110కే లభింనుంది. లీటర్ డీజిల్రూ.98కే లభించనుంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Oil prices

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు