అమరావతిపై తేల్చేసిన కేంద్రం.. జగన్ సర్కార్‌కు భారీ ఊరట

Andhra Pradesh: రాష్ట్ర రాజధానులను నిర్ణయించే అంశం కేంద్రం పరిధిలోని రాదని మరోసారి కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.

news18-telugu
Updated: August 6, 2020, 12:24 PM IST
అమరావతిపై తేల్చేసిన కేంద్రం.. జగన్ సర్కార్‌కు భారీ ఊరట
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్ సర్కార్‌కు భారీ ఊరట లభించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన బిల్లులకు ఏపీ గవర్నర్ ఆమోదం తెలపగా.. తాజాగా ఈ అంశంపై కేంద్రం కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రాష్ట్ర రాజధానులను నిర్ణయించే అంశం కేంద్రం పరిధిలోని రాదని మరోసారి కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్రాల రాజధానుల నిర్ణయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని కేంద్రం పేర్కొంది. ఈ విషయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదంటూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ కోర్టుల్లో న్యాయసమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ అఫిడవిట్‌లో వివరించింది.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు జులై 31న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్రవేశారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లును కూడా గవర్నర్ ఆమోదించారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ హరిచందన్ ఆమోదం తెలపడంతో విశాఖపట్నం అధికారికంగా పరిపాలనా రాజధాని కానుంది. అలాగే, అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. హైకోర్టు కర్నూలుకు తరలివెళ్లనుంది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై హైకోర్టు ఆగస్టు 4న స్టే విధించింది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదిస్తూ గవర్నర్ ఇచ్చిన గెజిట్‌పై మంగళవారం స్టేటస్ కో విధించింది. రిప్లై కౌంటర్‌కు 10 రోజులు గడువు ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరడంతో.. అప్పటి వరకు యథాతధ స్థితిని కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది.
Published by: Kishore Akkaladevi
First published: August 6, 2020, 12:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading