Home /News /andhra-pradesh /

CENTRE APPROVES VISAKHAPATNAM RAILWAY ZONE AND TWO METRO RAILS FOR AGRA AND KANPUR BA

యూపీకి రెండు మెట్రో రైల్ ప్రాజెక్టులు.. ఏపీ మెట్రోలకు మోక్షం ఎప్పుడు?

అరుణ్ జైట్లీ (File)

అరుణ్ జైట్లీ (File)

ఆగ్రా, కాన్పూర్‌కు మెట్రో రైల్ ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించింది. అయితే, విజయవాడ, విశాఖ రైల్వే జోన్ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

    ఎన్నికలకు ముందు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని రెండు నగరాలకు మెట్రో రైళ్లను మంజూరు చేసింది. ఆగ్రా, కాన్పూర్‌లో మెట్రో రైళ్లకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో రెండు కారిడార్లు ఉంటాయి. అందులో ఒకటి 14 కిలోమీటర్ల మెట్రో రైల్ కారిడార్ ఉంటుంది. మొదటి దాంట్లో 14 స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టు విలువ రూ.8300 కోట్లు పైగానే ఉంది. మరోవైపు కాన్పూర్‌లో కూడా రెండు కారిడార్లతో మెట్రో రైలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఐఐటీ వస్త్ర కారిడార్ 32 కిలోమీటర్ల మేర ఉంటుంది. మరొకటి అగ్రికల్చర్ యూనివర్సిటీ కారిడార్. కాన్పూర్ మెట్రో రైలు ప్రాజెక్టు ఖర్చు రూ.12,000 కోట్లు. ఈ రెండింటినీ ఐదేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు అరుణ్ జైట్లీ తెలిపారు.

    hyderabad, Hyderabad metro, Hyderabad metro rail romance, romance in lift, romance in Hyderabad metro elevators, cctv footage in Hyderabad metro, హైదరాబాద్ మెట్రో, హైదరాబాద్ మెట్రో స్టేషన్ లిఫ్ట్స్, లిఫ్ట్‌లో రొమాన్స్, ముద్దులాట మెట్రో
    హైదరాబాద్ మెట్రో రైలు (ప్రతీకాత్మక చిత్రం)


    యూపీలో రెండు మెట్రో రైల్ ప్రాజెక్టులకు కొత్తగా ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం ఏపీలో విశాఖపట్నం రైల్వే జోన్‌కు ఆమోదముద్ర వేసినట్టు అరుణ్ జైట్లీ తెలిపారు. అయితే, ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్టు గురించి మాత్రం ఆయన స్పందించలేదు. ఏపీ రాజధాని అమరావతి, విశాఖ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులు నిర్మించే అంశాన్ని పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచారు. దీనికి డిటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు కూడా రెడీ అయింది. కానీ, ఇంతవరకు ఏ ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో పట్టాలు ఎక్కలేదు.

    India raises customs duty, imports from Pakistan, 200 percent import duties, Arun Jaitley, Pakistan, పాకిస్థాన్, అరుణ్ జైట్లీ, కస్టమ్స్ డ్యూటీ పెంపు, కస్టమ్స్ డ్యూటీ 200శాతం, పాకిస్థాన్ నుంచి దిగుమతి, పాక్ వస్తువులపై దిగుమతి సుంకం
    కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ


    రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సర్వ సన్నద్ధం అవుతోంది. 2014 ఎన్నికల్లో ఎన్డీయే 73 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 71, అప్నాదళ్ 2 సీట్లు గెలుచుకున్నాయి. ఈసారి కూడా యూపీలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలని బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే యూపీకి రెండు మెట్రో రైల్ ప్రాజెక్టులను ఆమోదించినట్టు భావిస్తున్నారు.
    First published:

    Tags: Amaravati, Andhra Pradesh, Arun Jaitley, Pm modi, Visakha Railway Zone, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు