ఏపీ హైకోర్టు తరలింపుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉందని కేంద్రం వెల్లడించింది. దీనిపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటైందని పేర్కొంది. సీఎం జగన్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని ప్రతిపాదించారని.. అయితే సీఎం మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతికేరకంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని కేంద్రం తన సమాధానంలో వెల్లడించింది.
గతంలోనూ కేంద్రం ఇదే రకమైన సమాధానం ఇచ్చింది. గత ఆగస్టులో దీనిపై స్పందించిన కేంద్రం.. ఈ విషయంలో ముందు రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాలని ఆ తర్వాతే కేంద్రానికి ప్రతిపాదనలు ఇవ్వాలని వ్యాఖ్యానించింది. వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు.
ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చే ప్రతిపాదనేదీ పెండింగ్‌లో లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. హైకోర్టు నిర్వహణ ఖర్చును భరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంకు ఉంటుందన్నారు. ఈ విషయంలో హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వమే సంప్రదించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుత హైకోర్టును కర్నూలుకు మార్చడంపై పూర్తి ప్రతిపాదన రావాలన్నారు. దీనిపై హైకోర్టు, ఏపీ ప్రభుత్వం రెండూ తమ అభిప్రాయాలను కేంద్రానికి సమర్పించాలని ఆయన చెప్పారు.
Tirumala: తిరుమల సహజ శిలాతోరణం ఎలా ఏర్పడిందో తెలుసా?
Breaking News: ముగిసిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పోలింగ్.. గెలుపు ఎవరిది..? క్రాస్ ఓటింగ్ జరిగిందా?
అమరావతి నుంచి ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించే విషయం కేంద్రం వద్ద పెండింగ్‌లో లేదని.. హైకోర్టు ఎక్కడున్నా దాని నిర్వహణ బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదే అని కామెంట్ చేశారు. హైకోర్టు తరలింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టునే సంప్రదించి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. హైకోర్టు తరలింపుపై ఇటు హైకోర్టుతో పాటు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. తాజాగా కేంద్రం మరోసారి ఇదే రకమైన సమాధానం ఇచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP High Court