హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

డబుల్ బొనాంజా.. ఆ పథకంలో ఏపీకి కేంద్రం నిధులు రెండింతలు.. వెల్లడించిన ఎంపీ పరిమళ్ నత్వానీ

డబుల్ బొనాంజా.. ఆ పథకంలో ఏపీకి కేంద్రం నిధులు రెండింతలు.. వెల్లడించిన ఎంపీ పరిమళ్ నత్వానీ

రాజ్యసభ సభ్యులు పరిమల్ నత్వానీ

రాజ్యసభ సభ్యులు పరిమల్ నత్వానీ

2019–20 ఆర్ధిక సంవత్సరంలో కేంద్రప్రభుత్వం కేటాయించిన రూ. 372.64 కోట్లలో మొత్తం నిధులను రాష్ట్రానికి అందించారు. ఇక 2020–21 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ.790.48 కోట్లలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ. 162.59 కోట్లను విడుదల చేసింది.

ఇంకా చదవండి ...

జల్‌జీవన్‌ మిషన్‌ (జేజేఎం) కింద 2020–21 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు చేసింది. జేజేఎం కింద, కేంద్రం 2019–20 ఆర్ధిక సంవత్సరంలో రూ.372.64 కోట్లను మాత్రమే కేటాయించింది. దీనిని 2020–21 ఆర్ధిక సంవత్సరంలో రూ.790.48 కోట్లకు వృద్ధి చేసింది. ఈ సమాచారాన్ని రాజ్యసభ సభ్యుడు పరిమల్‌ నత్వానీ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా జల్‌శక్తి శాఖ సహాయమంత్రి రతన్‌లాల్‌ కటారియా ఫిబ్రవరి 08, 2021వ తేదీన రాజ్యసభలో వెల్లడించారు. మంత్రి కటారియా వెల్లడించిన దానిప్రకారం జల్‌జీవన్‌ మిషన్‌ను ఆగస్టు 15,2019వ సంవత్సరంలో ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 3.36 కోట్ల గ్రామీణ ప్రాంత గృహాలకు ట్యాప్‌ వాటర్‌ కనెక్షన్స్‌ను అందించారు. ఈ కాలంలో, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 6.26 లక్షల గ్రామీణ ప్రాంత గృహాలకు ట్యాప్‌ వాటర్‌ కనెక్షన్స్‌ అందించారు.

2019–20 ఆర్ధిక సంవత్సరంలో కేంద్రప్రభుత్వం కేటాయించిన రూ. 372.64 కోట్లలో మొత్తం నిధులను రాష్ట్రానికి అందించారు. ఇక 2020–21 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ.790.48 కోట్లలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ. 162.59 కోట్లను విడుదల చేసింది. గత రెండు సంవత్సరాలలో జల్‌జీవన్‌ మిషన్‌ కింద అందించిన మొత్తం కనెక్షన్స్‌ను ఎన్ని అనేది నత్వానీ తెలుసుకోవాలనుకున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇదే కాలంలో ఎన్ని ఇళ్లకు ట్యాప్‌ నీళ్ల కనెక్షన్‌ అందించారని ప్రశ్నించారు. మంత్రి కటారియా ప్రకటించిన దాని ప్రకారం జేజేఎం కింద విడుదల చేసిన మొత్తం నిధులలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫిబ్రవరి 04, 2021 వ తేదీ నాటికి రూ.372 కోట్ల నిధులను వినియోగించినట్లుగా నివేదించింది.

First published:

Tags: Andhra Pradesh, Parimal Nathwani

ఉత్తమ కథలు