Amaravati: మూడు రాజధానులు ఉండొచ్చు.. కేంద్రం క్లారిటీ

2018లో అప్పటి ప్రభుత్వం అమరావతిలో హైకోర్టు పెట్టిందన్న కేంద్రం.. హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతినే రాజధాని అని చెప్పలేమని తెలిపింది.

news18-telugu
Updated: September 10, 2020, 11:34 AM IST
Amaravati: మూడు రాజధానులు ఉండొచ్చు.. కేంద్రం క్లారిటీ
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
మూడు రాజధానులపై హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్‌లో కేంద్రం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. రాజధానుల్లో కేంద్రం పాత్రపై హోంశాఖ మరింత స్పష్టత ఇచ్చింది. ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని కేంద్రం పేర్కొంది. సెక్షన్ 13 ప్రకారం రాజధాని ఆంటే ఒకటికే పరిమితం కావాలని కాదని అని క్లారిటీ ఇచ్చింది. 2018లో అప్పటి ప్రభుత్వం అమరావతిలో హైకోర్టు పెట్టిందన్న కేంద్రం.. హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతినే రాజధాని అని చెప్పలేమని తెలిపింది. రాజధానికి కేంద్రం ఆర్థిక సహాయం మాత్రమే చేస్తుందని.. రాజధాని అంశంపై రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని మరోసారి స్పష్టం చేసింది. దీనిపై పిటిషనర్ దోనె సాంబశివరావువి అపోహలేనని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది.

ఈ అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ అంశంపై పలుసార్లు అఫిడవిట్లు దాఖలు చేసింది. అన్నింట్లోనూ రాజధాని విషయంలో కేంద్రం పాత్ర ఉండదని స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధానాలు నిర్ణయించుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే ఉంటుందని పేర్కొంది. అయితే తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం ఈ అంశంపై మరింత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని కేంద్రం పేర్కొంది. సెక్షన్ 13 ప్రకారం రాజధాని ఆంటే ఒకటికే పరిమితం కావాలని కాదని అని తెలిపింది. దీంతో ఏపీ మూడు రాజధానుల ప్రతిపాదనకు కేంద్రం వాదన మరింత బలానిచ్చే అంశంగా చెప్పొచ్చు.
Published by: Kishore Akkaladevi
First published: September 10, 2020, 11:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading