కడప సెంట్రల్ జైలు ఖైదీలు రూ.10కే మాస్కును తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ మాస్కులను ఉతికి, శుభ్రం చేసి తిరిగి వాడుకునే వెసులుబాటు ఉంది. కరోనా వైరస్ రోజురోజూకీ విజృంభిస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్రప్రాణ నష్టం జరుగుతోంది. దీంతో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కరోనా నివారణ చర్యల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బయటకు వెళ్లిన సందర్భాల్లో ప్రజలు మాస్కులు ధరించడం, వైద్యులు, రోగులు ఇలా ప్రతిఒక్కరూ మాస్కులు ధరిస్తున్నారు. దీంతో మాస్కులకు తీవ్ర కొరత ఏర్పడింది. దీన్ని అధిగమిచేందుకు కడప సెంట్రల్ జైలు ఖైదీలు ముందుకొచ్చారు.
ఇక్కడ శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు ముసుగులు తయారు చేస్తూ కరోనా వైరస్ వ్యాప్తిలో తమవంతు భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. ఖైదీలు ముసుగులు తయారు చేసేందుకు జిల్లా కలెక్టర్ హరికిరణ్ 30 కుట్టు యంత్రాలను అందించారు. ఈ జైలులో 50 మంది ఖైదీలు మాస్కుల తయారీలో పనిచేస్తున్నారు. అయితే వీరు తయారు చేస్తున్న మాస్కులను తిరిగి ఉపయోగించవచ్చు. మాస్కులను ఉతకడం, కడిగి శుభ్రం చేసే ఫేస్ మాస్కులను ఖైదీలు తయారు చేస్తుండడం గమనార్హం. ఇదిలావుంటే.. గత 14 సంవత్సరాల నుంచి మసుగులు తయారు చేస్తున్నారు. నిత్యం 2500 నుంచి 3వేల ముసుగులు తయారు చేస్తుండగా, ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా వారికి 49,500 మాస్కుల తయారీకి ఆర్డర్ రావడం గమనార్హం.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.