Central Minster on Andhra Pradesh Three Capitals: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మూడు రాజధానుల అంశం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ఆ మధ్య సీఎం జగన్ (CM Jagan) స్వయంగా మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నారు. కొన్ని రోజుల తరువాత కొత్త జిల్లాల (AP New Districts)ను తెరపైకి తెచ్చారు. పరిపాలనా వికేంద్రీ కరణ కోసమే అంటూ కొత్తగా మరో 13 జిల్లాలను ప్రకటించారు. దీంతో మూడు రాజధానుల అంశం గతమంటూ చర్చ జరిగింది. అదేం లేదని మంత్రులు, వైసీపీ నేతలు పదే పదే వివరణ ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాజధానుల విషయంలో వెనక్కు తగ్గదే లే అంటున్నారు. కచ్చితంగా మూడు రాజధానులు ఏర్పడతాయని.. ఈ విషయంలో ఎవరూ అడ్డుపడలేరని మంత్రి కొడాలి నాని (Minster Kodali Nani).. అవంతి శ్రీనివాస్ (Minster Avanti Srinivas) ఇటీవలే స్పష్టం చేశారు. దీంతో మళ్లీ మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఇలాంటి సమయంలో మూడు రాజధానుల అంశంపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రామ్ దాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు సైతం అమరావతికే తమ ఓటు అంటున్నారు. ఇటీవలం కేంద్రం ప్రభుత్వం కూడా ఏపీకి అమరావతే రాజధాని అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి సమయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..
కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే ఎమన్నారంటే..? ప్రస్తుతం ఏపీ రాజధానిగా ఉన్నఅమరావతిలోనే అభివృద్ధి సరిగా జరగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన సరి కాదన్నారు ఆయన. రెండు చోట్ల రాజధానులు పర్వాలేదని.. మూడు రాజధానులతో ప్రజలకు సౌలభ్యంగానే ఉంటుందని.. అయితే అది అంత ఈజీ కాదు అన్నారు. మూడు రాజధానులను అభివృద్ధి చేయడం చాలా కష్టమని తేల్చి చెప్పారు. విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి మూడు రాజధానుల అంశంపై స్పందించారు.
ఇదీ చదవండి : ఓ రేంజ్ లో వైసీపీ నేతల కామెంట్లు.. కేంద్రం ఊహించని షాక్.. చంద్రబాబు రిలాక్స్ అయ్యారా..?
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి నష్టం జరిగింది అన్నమాట వాస్తవమే అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని కూడా గుర్తించారని వెల్లడించారు. అందుకే ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కలసి కోరాలని సూచించారు. ఏపీ అభివృద్ధి కోసం బీజేపీతో జగన్ చేతులు కలపాలని ఆయన సూచించారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం కోసం తాను కూడా ప్రయత్నిస్తానని చెప్పారు. పార్లమెంటులో పెట్టే అన్ని బిల్లులకు వైసీపీ మద్దతిస్తోందన్నారు కేంద్రమంత్రి..
ఇదీ చదవండి : తగ్గేదే లే అంటున్న ఫైర్ బ్రాండ్.. ఇది మా విజయం అంటున్న ఎమ్మెల్యే రోజా
మూడు రాజధానుల కంటే అమరావతిని అభివృద్ధి చేయడమే మేలన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాల్సిందని.. కానీ అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ అంశాలను విస్మరించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం అమరావతిలో అభివృద్ధి పనులు ఆగిపోవడం ఆవేదన కలిగిస్తోంది అన్నారు. మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం దీనికి నిధులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. నిధులు లేకపోతే రాజధాని నిర్మాణం ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. అందుకే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను పక్కన పెట్టి.. ప్రస్తుతం ఒక్క రాజధానికి నిధులు ఇవ్వాలని కోరడం ఉత్తమమని కూడా అభివృద్ధి చెందడం లేదు. అలాంటప్పుడు 3 రాజధానుల అంశం సరికాదు. ఏ అంశానికైనా నిధులు ముఖ్యం. నిధులు లేకే అమరావతి అభివృద్ధి చెందడం లేదు” అని కేంద్రమంత్రి చెప్పారు.
ఇదీ చదవండి : కొత్త జిల్లాలపై అభ్యంతరాలు ఉన్నాయా..?ఇలా చెప్పొచ్చు.. పత్యేక కమిటీ ఏర్పాటు
ఏపీలో రాజధాని అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏపీకి ఒక్కటే రాజధాని, అదీ అమరావతే అని ప్రతిపక్షాలు చెబుతుండగా.. ఒకటి కాదు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అంటోంది. పరిపాలన సౌలభ్యం కోసం, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందడం కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అంటోంది.
ఇదీ చదవండి : 27 ఏళ్ల ఆమె 23 ఏళ్ల యువకుడిపై మోజు పడింది.. 40 ఏళ్ల భర్తను ఏం చేసిందంటే..?4
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును మరోసారి ప్రవేశ పెడతామని ఇటీవలే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తేల్చి చెప్పారు. ప్రజల ఆమోదంతో మూడు రాజధానులు నిర్మిస్తామన్నారు. గతంలో శాసనమండలిలో తమకున్న బలంతో ఈ బిల్లులను టీడీపీ నిలిపివేసిందన్నారు. ప్రతిపక్షాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap capital, Ap cm jagan, AP News