Home /News /andhra-pradesh /

CENTRAL HOME MINISTER AMIT SHAH ANDHRA PRADESH TOUR CANCELLED REASONS NOT REVEALED FULL DETAILS HERE PRN

Amit Shah Tour: అమిత్ షా తిరుపతి టూర్ రద్దు.. కారణం అందేనా..?

అమిత్ షా (ఫైల్)

అమిత్ షా (ఫైల్)

Amit Shah: ఐదు రాష్ట్రాల ఎన్నికల (Assembly Elections 2021) షెడ్యూల్ విడుదలైనందున ఆ ఏర్పాట్ల కోసమే తిరుపతి (Tirupati) పర్యటనను రద్దు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి

    కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దైంది. ఈనెల 4,5 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశానికి అమిత్ షా హాజరుకావాల్సి ఉంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, కర్ణాటక,తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు, లక్షద్వీప్ ప్రతినిథులు హాజరుకావాల్సి ఉంది. ఐతే అమిత్ షా పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. అమిత్ షా పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నారనేదానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. ఐతే ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఆ ఏర్పాట్ల కోసమే తిరుపతి పర్యటనను రద్దు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.

    ఈ నేపథ్యంలో ప్రచార వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికలు, పార్టీ నేతలతో చర్చలు వంటి కార్యక్రమాలతో అమిత్ షా బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో టూర్ వాయిదా పటినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ను టార్గెట్ చేసిన బీజేపీ అక్కడ అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. బెంగాల్ లో మార్చి 2 నుంచే నోటిఫికేషన్ మొదలుకానుండటంతో షా ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నట్లు సమాచారం.

    ఇది చదవండి: అప్పుడు జగన్.. ఇప్పుడు చంద్రబాబు.. సేమ్ సీన్ రిపీట్..



    మరోవైపు అమిత్ షా ఏపీకి వస్తే ఆయనతో భేటీ అయి తిరుపతి అభ్యర్థిపై క్లారిటీ తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావించారు. అమిత్ షాతో భేటీ అవుతున్నట్లు కూడా పర్యటించారు. ఇప్పుడు షా టూర్ రద్దవడంతో అటు బీజేపీతో పాటు ఇట జనసేన కూడా నిరాశ చెందింది.

    ఇది చదవండి: రేణిగుంట ఎయిర్ పోర్టులో టెన్షన్ టెన్షన్... చంద్రబాబుకు నో పర్మిషన్...


    Published by:Purna Chandra
    First published:

    Tags: Amit Shah, Andhra Pradesh, Andhra pradesh news, AP News, Karnataka, Kerala, Puducherry, Tamil nadu, Telugu news, Tirupati, West Bengal

    తదుపరి వార్తలు