ఏపీ, తెలంగాణలకు కేంద్రం గుడ్ న్యూస్

తెలుగు రాష్ట్రాలకు కొత్తగా 16 మంది ఐఏఎస్‌లను కేటాయించింది. ఏపీకి 9 మంది, తెలంగాణకు ఏడుగురు ఐఏఎస్‌లను కేటాయించించింది.

news18-telugu
Updated: October 17, 2019, 9:44 PM IST
ఏపీ, తెలంగాణలకు కేంద్రం గుడ్ న్యూస్
కేసీఆర్‌తో జగన్ భేటీ (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలుగు రాష్ట్రాలకు కొత్తగా 16 మంది ఐఏఎస్‌లను కేటాయించింది. ఏపీకి 9 మంది, తెలంగాణకు ఏడుగురు ఐఏఎస్‌లను కేటాయించించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిపాలన కోసం ఐఏఎస్‌ల కొరత ఉంది. అవసరమైనంత కంటే తక్కువ మంది ఐఏఎస్‌లు ఉన్నారు. దీనికి తోడు మరికొందరు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలుచేయడానికి ఉన్నతాధికారులు లేరు. దీంతోపాటు తెలంగాణలో జిల్లాల సంఖ్య 10 నుంచి 33 కి పెంచారు. ఏపీలో కూడా జిల్లాల సంఖ్య పెంచవచ్చనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో కేంద్రం కొత్తగా ఐఏఎస్‌లను కేటాయించించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 17, 2019, 9:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading