CENTRAL GOVERNMNET BIG SHOCK TO ANDHRA PRADESH GOVERNMENT AFTER JUNE ONLY NEW DISTRICTS NOTIFICATION NGS GNT
AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సందిగ్థత.. ఆ లోపు సరిహద్దులు పూర్తి కాకపోతే కష్టమే..?
ప్రతీకాత్మకచిత్రం
AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లా ఏర్పాటుపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఇటీవల కేంద్రం రాసిన లేఖతో సందిగ్థత నెలకొంది.. కరోనా పరిస్థితిల కరాణంగా జనగణన ఆలస్యం అవుతోందని.. అయితే ఆ లోపు జిల్లాల సరిహద్దులు పూర్తి చేయాల్సిందే అని కేంద్రం మెలికి పెట్టింది. దీంతో ఇది సాధ్యమేనా అని అధికారులు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.
Big Shock to AP Government: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఉగాది నాటికి కొత్త జిల్లాలు (AP New Districts) ఏర్పాటు చేయాలని.. సంకల్పించింది. అయితే ఈ కొత్త జిల్లాల నోటిఫికేషన్ పై పెద్దగా అభ్యంతరాలు రావని ఏపీ ప్రభుత్వం (AP Government) భావించింది. దానికి సంబంధించి తొలి నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ ఇప్పటికే చాలా జిల్లాల్లో ఆందోళన పెరుగుతున్నాయి. కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. మరో నోటిఫికేషన్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. వైసీపీ నేతల నుంచి నుండి కూడా అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో.. ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అవ్వొచ్చు.. కానీ ఇదే సమయంలో కేంద్రం ఇటీవల రాష్ట్రాలకు రాసిన లేఖ మరిన్ని అనుమానాలు పెంచుతోంది. 2022 జూన్ 20వ తేదీ తరువాత జనగరణన ప్రారంభిస్తామని.. ఆ లోపే జిల్లాల సరిహద్దులు మార్చాల్సి ఉంటే.. చేసుకోవాలని.. జనగణన డైరెక్టర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు పంపారు.
ప్రస్తుతం కోవిడ్ థర్డ్ వేవ్ వ్యాక్సినేషన్ జరుగుతుండటం కారణంగా జనగణలో జాప్యం జరుగుతోందని జనగణన శాఖ డిప్యూటీ డైరెక్టర్ పేర్కొన్నారు. ఈ అంశాలను గుర్తించి.. జూన్ నాటికి జిల్లాల సరిహద్దులు మా ర్చినట్టు నోటిఫికేషన్ పంపించగలిగితే ఓకే.. లేదంటే ఆ తరువాత కుదరదని ఆ లేఖ సారాంశం.. దీంతో ప్రస్తుతం ఏపీలో జిల్లాల ప్రక్రియ జూన్ నాటికి పూర్తి కావాల్సి ఉంది.. ఒక వేళ అప్పటి వరకు పూర్తి చేయలేని పక్షంలో.. జనగణన పూర్తి అయిన తరువాతే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం 13 జిల్లాల ఏపీని.. ఏపీ ప్రభుత్వం 26 జిల్లాలుగా మారూస్తే నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్తగా ఏర్పాటు అవుతున్న 13 జిల్లాలు వాటి పేర్లు.. అలాగే 12 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంగళవారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికికేషన్ విడుదల చేసింది. అయితే వీటిపి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే.. 30 రోజుల సమయం ఇచ్చింది. కొత్త జిల్లాలపై వచ్చిన సూచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఉగాది నాటికి కొత్త నోటిఫికేషన్ వేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది. కానీ కొత్త జిల్లాలపై అభ్యంతరాలు పెరుగుతుండడంతో.. మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది..
మరోవైపు కొత్త జిల్లాల ప్రక్రియకు వ్యతిరేకంగా కొన్ని చోట్ల నిరసనలు మొదలయ్యాయి. మరికొన్ని చోట్ల కొత్త ఆంక్షలు పెడుతున్నారు స్థానికులు, రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో నిరసన సెగలు రాజుకుంటున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రాల ఏర్పాట్లపైనే అభ్యంతరాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుత కడప జిల్లాలో.. రాజం పేటనను కాదని.. రాయచోటిని జిల్లా కేంద్రంగా రచేయడంపై అక్కడి రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పురపాలక సంఘ కార్యవర్దం మొత్తం రాజీనామాకు సిద్ధ పడింది. చిత్తూరు జిల్లా మదనపల్లెను జిల్లా కేంద్రంగా రాయచోటిలో కలపడం ఏంటని.. ఆ ప్రాంతంలో నిరసనలు మొదలయ్యాయి. విజయవాడలో కలిసిపోయిన పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలను మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటు అయ్యే జిల్లాలో కలపడంపైనా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్ానయి. విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎస్ కోటను విజయనగరంలో కలపడం, నర్సీపట్నాన్ని జిల్లా కేంద్రం చేయకపోవడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.