Central Government on Polavaram Project: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు (AP Politics) మరోసారి పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) చుట్టూ తిరుగుతున్నాయి. ఓ వైపు గత రెండు రోజులుగా జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Minster Anil Kumar Yadav) పై ట్రోలింగ్ నడుస్తున్నాయి. దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అయినా ట్రోల్స్ ఆగడం లేదు.. ఇలాంటి సమయంలో కేంద్రం ఊహించని బాంబ్ పేల్చింది. వైసీపీ సర్కార్ కు షాక్ ఇస్తూ.. నిర్ణీత గవువు లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వడం అసాధ్యమని కేంద్రం వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రకటనకు ముందు ప్రతిపక్షాల తీరుపై మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) ను 2021 నాటికి పూర్తి చేస్తామని గతంలో మంత్రి అనిల్ చేసిన కామెంట్స్ పై టీడీపీ కార్యకర్తలు మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు. ఐతే ఈ ట్రోల్స్ కు మంత్రి అనిల్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుతో పాటు కొన్ని మీడియా సంస్థలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ప్రాజెక్టు ఆలస్యమైన మాట వాస్తమేనన్న అనిల్.. అది ఎందుకు ఆలస్యమైందో తెలుసుకోవాలని సూచించారు. కుల అజెండాలతో తనపై అవాకాలు చవాకులు పేలితే ఏమీ చేయలేరని మండిపడ్డారు.
ఇదీ చదవండి : నా పైన రెండు సీబీఐ కేసులే.. అధినేతపై వందల కేసులు.. లోక్ సభలో వైసీపీ ఎంపీల డైలాగ్ వార్
2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని గతంలో తాను చెప్పిన మాటలు వాస్తవేమనన్న ఆయన.. ఆలస్యమవడానికి గల కారణాలను కూడా వివరించారు. తనను విమర్శించే వాళ్లు డయాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బతిందో తెలుసుకోవాలన్నారు. రెండు కిలోమీటర్ల వెడల్పులో ఉండాల్సిన నదిని 600 మీటర్లకు కుదించారన్నారు. స్పిల్ వే కట్టిన తర్వాత నీటిని మళ్లించాల్సిందిపోయి.. మందుగానే ఆ పనిచేశారన్నారు.
ఇదీ చదవండి : విశాఖ అందాలను 360 డిగ్రీల్లో చూడాలని ఉందా..? లండన్ ఐ రా రమ్మంటోంది?
ఈ వివాదం కొనసాగుతుండగానే ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ప్రభుత్వంమరో షాక్ ఇచ్చింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం గురించి ప్రశ్నించారు. కనకమేడల ప్రశ్నకు కేంద్ర జలశక్తివనరుల సహాయమంత్రి బిశ్వేశ్వర తుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. బాధితులకు పునరావాసం, పరిహారంలో జాప్యంతో పాటు కరోనా కారణంగా పోలవరం నిర్మాణ పనుల్లోనూ జాప్యం జరిగిందని వెల్లడించారు.
ఇదీ చదవండి : విశాఖ రాజధానికి ముహూర్తం ఇదే?.. లీక్ చేసిన ఏపీ మంత్రి, జగన్ సన్నిహిత నేత..
స్పిల్ వే చానల్ పనులు 88 శాతం పూర్తవగా, ఎప్రోచ్ చానల్ ఎర్త్ వర్క్ పనలు 73 శాతం, పైలెట్ చానల్ పనులు 34 శాతం మాత్రమే పూర్తయ్యాయని కేంద్ర జలశక్తివనరుల సహాయమంత్రి తెలిపారు. పోలవరం సవరించిన అంచనాలు రూ.55,548.87కోట్లకు టీఏసీ ఆమోదించిన మాట వాస్తవమేనని, అయితే 2020 మార్చిలో సవరించిన అంచనాలపై ఆర్సీసీ నివేదిక ఇచ్చిందని, దాని ప్రకారం రూ.35,950.16 కోట్లకు మాత్రమే కేంద్రం అంగీకారం తెలిపిందని బిశ్వేశ్వర తుడు తన లిఖితపూర్వక సమాధానలో చెప్పారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Anil kumar yadav, AP News, Central governmennt, Minister anil kumar, Polavaram