Home /News /andhra-pradesh /

CENTRAL GOVERNMENT TO FOLLOW ANDHRA PRADESH GOVERNMENT FOOT STEPS TO IMPLEMENT RYTHU BHAROSA KENDRAS IN THE COUNTRY FULL DETAILS HERE PRN

AP News: జగన్ సర్కార్ ను ఫాలో అవుతున్న కేంద్రం... త్వరలో దేశవ్యాప్తంగా అమలు.. వివరాలివే..!

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను (Rythu Bharosa Kendras) ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయానికి అనుసంధానంగా ఆర్బీకేలను ఏర్పాటు చేసి అన్నదాతలను గైడ్ చేస్తోంది.

ఇంకా చదవండి ...
    రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను (Rythu Bharosa Kendras) ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయానికి అనుసంధానంగా ఆర్బీకేలను ఏర్పాటు చేసి అన్నదాతలను గైడ్ చేస్తోంది. రైతు భరోసా, పీఎం కిసాన్ (PM Kisan Scheme) పథకాలతో పాటు ఇన్ పుట్ సబ్సిడీ, పంట బీమా నమోదు, విత్తనాలు, ఎరువులు, ఈ-క్రాప్ రిజిస్ట్రేషన్ వంటి పనుల్లో రైతులకు చేదోడుగా ఉంటోంది. రైతులకు సంబంధించిన ప్రతి అంశం రైతు భరోసా కేంద్రాల ద్వారానే నడుస్తున్నాయి. ప్రస్తుతం ట్రాక్టర్లు, యంత్రాల పంపిణీ కూడా రైతు భరోసా కేంద్రాలే చూస్తున్నాయి. ఐతే ఏపీలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలకు దేశంలోనే మంచి పేరొచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం వీటిపై ఆసక్తి చూపుతోంది.

    దేశవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల తరహాలోనే సేవలందించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ రైతు భరోసా కేంద్రాలపై దృష్టిపెట్టింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ముఖ్యకార్యదర్శి మనోజ్ అహూజా నేతృత్వంలోని ఉన్నతాధికారుల కమిటీ ఏపీలో పర్యటించనుంది. బుధవారం కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. తొలుత ఈ బృందం గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన సమీకృత రైతు సమాచార కేంద్రంతో పాటు ఆర్బీకే చానల్‌ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను పరిశీలించి వివరాలను సేకరిస్తుంది.

    ఇది చదవండి: ఏపీ ప్రభుత్వం ఆల్ టైమ్ రికార్డు.. దేశంలో 50శాతం ఇక్కడి నుంచే..!


    ఆ తర్వాత కంకిపాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఉయ్యూరు మండల పరిధిలోని పెదఓగిరాల గ్రామ రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి.. అక్కడ రైతులతో భేటీ అయి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకుంటారు. ఆర్బీకేల్లో ఈ-పంట నమోదు, ఉచిత బీమా అమలు, ప్రభుత్వం చెల్లిస్తున్న బీమా ప్రీమియం, కేంద్రం అందిస్తున్న బీమాకు దీనికి తేడాలను నమోదు చేసుకుంటారు. క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం కేంద్ర బృందం సీఎం జగన్ తో భేటీ అయ్యే అవకాశముంటుంది.


    ఇది చదవండి: ఈనెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ..? సభ ముందుకు వచ్చే అంశాలు ఇవేనా..?


    రైతులకు అన్నిరకాల సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఆర్బీకేలను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలు కూడా ఆర్బీకేలపై దృష్టిపెట్టాయి. పలు ఆఫ్రికన్ దేశాల ప్రతినిథులు, ఇతర రాష్ట్రాల మంత్రులు, అధికారులు, కేంద్ర మంత్రులు కూడా ఆర్బీకేలను పరిశీలించి అక్కడ అందుతున్న సేవలను మెచ్చుకున్నారు. అంతేకాదు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అవార్డుకు కూడా రైతు భరోసా కేంద్రాలు నామినేట్ అయ్యాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, Central Government, Rythu Bharosa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు