హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Power Cuts: తెలుగు రాష్ట్రాలకు కరెంటు కష్టాలు తప్పవా..? కేంద్రం ఆంక్షలతో విద్యుత్ ఛార్జీల బాదుడు భయం?

Power Cuts: తెలుగు రాష్ట్రాలకు కరెంటు కష్టాలు తప్పవా..? కేంద్రం ఆంక్షలతో విద్యుత్ ఛార్జీల బాదుడు భయం?

తెలుగు రాష్టాలకు విద్యుత్  కోతల టెన్షన్

తెలుగు రాష్టాలకు విద్యుత్ కోతల టెన్షన్

Power Cuts: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల విద్యుత్ కోతలు భయపెట్టాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అప్రకటితో కోతలు కలవర పెట్టాయి. ఇప్పుడు పరిస్థితి సద్దుమణిగింది నుకుంటే.. కేంద్రం షాకిచ్చింది. తాజా ఆంక్షలతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కరెంటు కష్టాలు తప్పవనే భయం వెంటాడుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

Power Cuts: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాలకు మళ్లీ విద్యుత్ గండం (Power Crises) పొంచి ఉందా..? త్వరలో పవర్ కట్ కానుందా..? ఇప్పటికే ఎక్స్ చేంజ్ లలో విద్యుత్ కొనుగోలు నిలిచిపోనుంది. దానికి కారణం ఏంటంటే..? విద్యుత్ బకాయిల కారణంగా మొత్తం.. 11 రాష్ట్రాలకు అమ్మకం నిలిపివేయాలని కేంద్రం (Central Government) ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనే పడనుంది. అయితే అవసరాలను బట్టి తెలంగాణ డిస్కమ్ లు రోజూ 5 నుంచి 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నాయి.  కేంద్రం ఆదేశాలతో విద్యుత్ కొనుగోలుకు ఆటంకం ఏర్పడనుంది. తెలంగాణ నుంచి 1300 కోట్లకుపైగా చెల్లించాలని, ఏపీ డిస్కమ్ ల నుంచి 400 కోట్లకుపైగా బకాయిలు రావాలని కేంద్రం చెబుతోంది. ప్రస్తుతం కేంద్రం ఆదేశాల కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు..  తమిళనాడు (Tamilanadu), కర్నాటక (Karnataka) , బీహార్ (Bihar) , జార్ఖండ్ (Jharkhand) , మధ్యప్రదేశ్ (Madhya Pradesh) , మహారాష్ట్ర (Maharashtra), ఛత్తీస్ ఘడ్ (Chhattisgarh), జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) , రాజస్తాన్ (Rajasthan) , మణిపూర్ ( Manipur) , మిజోరం (Mizoram) రాష్ట్రాలకు విద్యుత్ గండం పొంచి ఉంది. మొత్తం 13 రాష్ట్రాలు కలిపి.. 5 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్టు కేంద్రం చెప్పింది.

తెలంగాణ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు తెలంగాణలోని విద్యుత్ సంస్థలు సెంట్రల్ ఎక్స్ చేంజ్ ద్వారా వివిధ రాష్ట్రాల నుంచి రోజుకు 5 నుంచి 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేస్తుంది. అయితే బకాయిలు చెల్లించని కారణంగా ఎక్స్ చేంజ్ ల ద్వారా తెలంగాణ రాష్ట్రం కొనుగోలు చేస్తున్న విద్యుత్ ను నిలిపివేస్తామని కేంద్రం ప్రకటించింది. కేంద్రం ఆదేశాలతో తెలంగాణ విద్యుత్ సంస్థలు అలర్ట్ అయ్యాయి. ఈ ఆంక్షలతో ఇప్పటికిప్పుడు విద్యుత్ అంతరాయం కలగకపోవచ్చు.. కానీ రానున్న రోజుల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఏపీ విషయానికి వస్తే విద్యుత్‌ డిమాండ్‌ నానాటికీ పెరిగిపోతోంది. మే నెలలోనూ లేనంతగా.. ఆగస్టులోనూ అడపాదడపా వర్షాలు పడుతున్నా మరోవైపు ఎండలు చంపేస్తున్నాయి. దీంతోగురువారం రాష్ట్రంలో 209.617 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ ఉండగా.. గత ఏడాది ఆగస్టు 17న 180.074 మిలియన్‌ యూనిట్లు నమోదైంది. అంటే 12.23 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ ఎక్కువగా వాడాల్సి వచ్చింది. రాష్ట్రంలో జెన్కో థర్మల్‌ కేంద్రాల నుంచి 58.347 మిలియన్‌ యూనిట్లు.. జెన్కో హైడల్‌ ప్రాజెక్టుల నుంచి 23.414 మిలియన్‌ యూనిట్లు, సీజీఎస్‌ నుంచి 39.262 మిలియన్‌ యూనిట్లు, ఐపీపీ (సెయిల్‌, హెఎన్‌పీసీఎల్‌, గ్యాస్‌)ల నుంచి 21.324 మిలియన్‌ యూనిట్లు, పవన విద్యుత్‌ 22.905 మిలియన్‌ యూనిట్లు, సోలార్‌ 23.360 మిలియన్‌ యూనిట్లు, ఇతర రంగాల నుంచి 1.694 మిలియన్‌ యూనిట్లు.. మొత్తంగా 190.107 మిలియన్‌ యూనిట్లు అందుబాటులో ఉంది.

ఇదీ చదవండి : జాతీయ స్థాయిలో రోజాకి క్రేజ్.. సంతోషాన్ని షేర్ చేసుకున్న మంత్రి

పూర్తి డిమాండ్‌ను తట్టుకునేందుకు.. బహిరంగ మార్కెట్లో రూ.12.9 కోట్లను చెల్లించి.. 19.36 మిలియన్‌ యూనిట్లు కొన్నారు. ఇదే డిమాండ్‌ శని, ఆదివారాల్లోనూ నమోదయ్యే అవకాశం ఉంది. అంటే.. ఈ డిమాండ్‌ను తట్టుకోవాలంటే.. బహిరంగ మార్కెట్లోకి వెళ్లాల్సిందే. అలా వెళ్లినప్పుడు కేంద్రం నిషేధం అమల్లోకి వస్తే.. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు తప్పకపోవచ్చనే ఆందోళన పెరుగుతోంది. గతంలోనూ ఏపీలో విద్యుత్ కోతలు భయపెట్టాయి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో అనధికారిక కరెంటు కోతలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇదీ చదవండి : మాజీ మంత్రిపై కుట్ర జరుగుతోందా? వాళ్ల చిట్టా అనిల్ బయటపెడతారా? ఎవరు వారు..?

కేంద్రం ఆంక్షలు కొనసాగితే కష్టాలు తప్పకపోవచ్చు.. రాష్ట్ర వాదన మాత్రం వేరేలా ఉంది. తాజా లెక్కలు అప్‌డేట్‌ కానందునే కేంద్రం తమకు గురువారం నోటీసులు జారీ చేసిందని రాష్ట్ర విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలుపై కేంద్రంపై నిషేధం విధించగానే స్పందించామని తెలిపారు. కేంద్రం ఆంక్షలతో ఆంధ్రప్రదేశ్ కు నష్టం లేదంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, ELectricity, Power cuts, Telangana

ఉత్తమ కథలు