• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • CENTRAL GOVERNMENT GIVES CLARITY ON SHIFTING OF ANDHRA PRADESH HIGH COURT FROM AMARAVATHI TO KURNOOL PRN

AP High Court: ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం కీలక ప్రకటన.. వైసీపీ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయినట్లేనా..?

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టు (AP High Court) తరలింపుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వైఎస్ఆర్సీపీ (YSRCP) ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో కేంద్రం చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో కేంద్రం చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. హైకోర్ట్ తరలింపు నిర్ణయం ప్రస్తుతం ఏపీ హైకోర్ట్ పరిధిలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. 2020 ఫిబ్రవరిలో హైకోర్టును తరలించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రతిపాదనలు వచ్చాయని.. ఐతే ఈ విషయంలో తుది నిర్ణయం హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదేనని పేర్కొన్నారు. హైకోర్టు, ప్రభుత్వం ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందన్నారు. హైకోర్టు తరలింపు, నిర్వహణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేశారు.

    ఇక రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 2019 డిసెంబర్ లో సీఎం జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారు. రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఐతే మూడు రాజధానుల ఏర్పాటుపై కోర్టుల్లో కేసులు దాఖలవడంతో ఆలస్యమవుతూ వస్తోంది. సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాల అమలుపై హైకోర్టు స్టే ఇవ్వడంతో రాజధాని తరలింపుకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి.

    శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లులను పాస్ చేయకపోవడంతో ఏకంగా మండలిని రద్దు చేసేందుకు సిఫార్సు చేశారు. ఇదిలా ఉంటే మూడు రాజధానుల ఏర్పాటు తథ్యమని వైసీపీ ప్రభుత్వం తరచూ స్పష్టం చేస్తూనే ఉంది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు హైకోర్టు తరలింపు అంశాన్ని లేవనెత్తాలని సీఎం జగన్.. వైసీపీ ఎంపీలకు సూచించారు. అందుకు భిన్నంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ ఈ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించారు. మార్చినాటికి రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీలైనంత త్వరగా ప్రక్రియను ప్రారంభిస్తామని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. నాయపరమమైన చిక్కులన్నీ వీడిపోతాయని ఆయన స్పష్టం చేశారు.
    Published by:Purna Chandra
    First published: