CENTRAL GOVERNMENT GIVE CLARITY ON SPECIAL STATUS FOR AP AND POWER BILLS ISSUE WITH TELANGANA IN PARLIAMENT FULL DETAILS HERE PRN BK
AP Special Status: హోదాపై మరోసారి స్పందించిన కేంద్రం.. ఆ బకాయిలతో సంబంధం లేదని క్లారిటీ..
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు ప్రత్యేక హోదా (Special Status)పై కేంద్ర ప్రభుత్వం (Central Government) మరోసారి స్పందించింది. హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చామి స్పష్టం చేసింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయ రెడ్డి (Vijayasai Reddy) అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి సమాధానమిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు ప్రత్యేక హోదా (Special Status)పై కేంద్ర ప్రభుత్వం (Central Government) మరోసారి స్పందించింది. హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చామి స్పష్టం చేసింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయ రెడ్డి (Vijayasai Reddy) అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి సమాధానమిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల నీతి అయోగ్‌తో జరిపిన సమావేశంలో విజ్ఞప్తి చేసిన విషయం వాస్తవమేనని కేంద్ర మంత్రి అన్నారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలలో 90 శాతం కేంద్రం వాటా, 10 శాతం రాష్ట్ర వాటా ఉంటుందని ఆయన తెలిపారు. ఆ మేరకు పొందే ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక ఆర్థిక సహాయం కింద ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన దరిమిలా రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్థీకరణ చట్టంలో నిర్దేశించిన హామీలను నెరవేర్చే బాధ్యత ఉన్నందున, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సాయపడాలని ఆర్థిక సంఘాలు, నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు సిఫార్సు చేసినందున అవశేష ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. దీనికి అనుగుణంగానే రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి కింద 2015-16 నుంచి 2019-20 వరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వచ్చిందన్నారు.
2015-16 నుంచి 2019-20 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్‌ల కింద చేపట్టిన వాటికి రుణం సమకూర్చడంతోపాటు ఆ రుణంపై వడ్డీని కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తోందవి పంకజ్ చౌధరి వివరించారు. ఆ విధంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ 19,846 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి తెలిపారు. అలాగే వివిధ ఆర్థిక సంఘాలు చేసిన సిఫార్సులను అనుసరించి 2015-20 మధ్య కాలానికి రాష్ట్రానికి రెవెన్యూ లోటు గ్రాంట్ కింద 22,112 కోట్ల రూపాయలు, 2020-21లో 5,897 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు.
విద్యుత్ బకాయిలతో సంబంధం లేదు
విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారంలో ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్నవివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున ఆ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాలకు సూచించినట్లు ఇంధన శాఖ మంత్రి ఆర్కె సింగ్ వెల్లడించారు. తెలంగాణ 6,111 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని, కేంద్ర జోక్యం చేసుకుని బకాయిలు చెల్లించేలా కృషి చేయాలని కోరుతూ ఏపీ సీఎం ఈ ఏడాది జూలై 14న తమకు లేఖ రాసినట్లు చెప్పారు. విద్యుత్ సరఫరా ఒప్పందం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందమన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఉభయ రాష్ట్రాల మధ్య ఈ ఒప్పందం జరిగిందని కేంద్ర మంత్రి తెలిపారు. మొదట్లో ఏపీ నుంచి పొందిన విద్యుత్‌కు తెలంగాణ చెల్లింపులు జరిపిందని.., విద్యుత్ చార్జీలకు సంబంధించి తెలంగాణ బకాయిపడ్డ సొమ్ములో అసలుపై ఎలాంటి వివాదం లేదన్నారు. అసలుపై విధించిన వడ్డీ విషయంలోనే రెండు రాష్ట్రాల మధ్య పేచీ వచ్చిందని మంత్రి తెలిపారు.
ఈ వడ్డీ చెల్లింపుపై పవర్ పర్చేజ్ ఒప్పందంలోని షరతులకు లోబడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సామరస్య ధోరణిలో రాజీకి రావలసి ఉంటుందని మంత్రి అన్నారు. విద్యుత్ బకాయిల చెల్లింపులో తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని.., ఈ అంశం కోర్టు విచారణ పరిధిలో ఉన్నందున ఉభయ రాష్ట్రాలు సామరస్యంగా వివాదాన్ని పరిష్కరించుకోవడమే మార్గమని ఆర్కే సింగ్ స్పష్టం చేశారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.