హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Capital: అమరావతిపై కేంద్రం సంచలన నిర్ణయం.. భారీగా నిధుల కేటాయింపు.. మూడు రాజధానుల మాటేంటి..?

AP Capital: అమరావతిపై కేంద్రం సంచలన నిర్ణయం.. భారీగా నిధుల కేటాయింపు.. మూడు రాజధానుల మాటేంటి..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులకు (AP 3 Capitals) జై కొట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేగింది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులకు (AP 3 Capitals) జై కొట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. అమరావతి (Amaravati) లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. టీడీపీ (TDP) ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ సీఎం జగన్ విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని ప్రకటించారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర రాజధాని విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. ఐతే ఏపీ బీజేపీ నేతలు మాత్రం అమరావతే రాజధాని అని.. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసినందున తామ ఓటు అమరవితికేనని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం అందులో ఏపీ రాజధానిగా అమరావతినే నిర్ధారించింది. 2022-23 బడ్జెట్ లో అమరావతికి నిధులు కేటాయించింది. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులు కేంద్రం నిధులు కేటాయించింది. ఏపీ నూతన రాజధాని అమరావతి పేరుతోనే కేంద్రం బడ్జెట్‍లో ప్రొవిజన్ పెట్టింది. కేంద్ర బడ్జెట్‍లో పట్టణాభివృద్ధి శాఖ నుంచి అమరావతిలో సచివాలయం, ఉద్యోగుల నివాస గృహాల నిర్మాణానికి నిధులను కేటాయించింది.

ఇది చదవండి: వైసీపీ ఎమ్మెల్యేను గెలిపించి తప్పుచేశా..! చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి..


సచివాలయ నిర్మాణానికి రూ.1,214 కోట్లు అంచనా వ్యయంగా పేర్కొన్న కేంద్రం.., ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాల కోసం రూ.1,126 కోట్లుగా అంచనా వేసింది. జీపీఓఏ భూసేకరణ కోసం రూ.6.69 కోట్ల అంచనా వ్యయంగా పేర్కొని 2020-21, 2021-22 బడ్జెట్‍లో మొత్తం రూ.4.48 కోట్లు కేంద్రం ఖర్చుచేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఉద్యోగుల నివాస గృహాలకు అవసరమైన భూ సేకరణకు 2021-22లో రూ.21 కోట్లు అంచనా వేసి ఇప్పటికి రూ.18.3 కోట్లు ఖర్చు చేసిన్లట్లు పేర్కొంది. అలాగే 300 ఏజీ స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ.200 కోట్లు అంచనా వ్యయంగా నిర్ధారించింది.

ఇది చదవండి: పబ్లిక్ టాయిలెట్స్ డ్యూటీపై స్పందించిన ప్రభుత్వం.. విమర్శలపై అధికారులేమన్నారంటే..!


అమరావతికి కేంద్రం నిధులు కేటాయించడంతో మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ తర్వాతి స్టెప్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లులను మళ్లీ తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నందున కేంద్రం నిధుల కేటాయింపు దీనికి బ్రేక్ వేస్తుందా అనే చర్చ జరుగుతోంది. అమరావతికిచిన నిధులు ఇతర ప్రాజెక్టులపై ఖర్చు చేసేలా కేంద్రాన్ని ఒప్పిస్తుందా లేక పెండింగ్ నిర్మాణాలను పూర్తి చేస్తుందా అనేది వేచిచూడాలి.

First published:

Tags: Amaravati, Andhra Pradesh, Central Government

ఉత్తమ కథలు